
తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందర మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ ప్రధాని భారతరత్న నరసింహారావు హయాంలో అర్థికమంత్రిగా పనిచేసి న కాలంలో దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు అర్థిక వ్యవస్థకు బాటలు వేశారని ఒక ఉన్నతమైన వ్యక్తి ఆర్థికవేత్తగా సంస్కరణ పట్ల అంకితభావంతో ఎప్పటికీ గుర్తుండిపోయే సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని అభివృద్ధిలో ముందు ఉంచారని దేశానికి రెండుసార్లు ప్రధానమంత్రిగా సేవలందించి గొప్ప ఆర్థికవేత్తగా పనిచేశారని దేశం ఒక దిగ్గజంనాయకుని కోల్పోయిందని దేశానికి దేశ ప్రజలకు తీరనిలోటు అని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగ్ గౌడ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పొన్నాల పరుశురాం ఆరేపల్లి బాలు తిరుపతిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్మాని రాంలింగారెడ్డి గుగ్గిళ్ళ శ్రీకాంత్ గౌడ్ లక్ష్మీరాజ్యం యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు రాజు బేరినేని రాము జూపల్లి రాజేశ్వరరావు పొన్నం లక్ష్మణ్ తంగళ్ళపల్లి మాజీ ఉపసర్పంచ్ పెద్దూరి తిరుపతి చిన్నమనేని ప్రశాంత్ బాలసాని శ్రీనివాస్ ధర్మ రెడ్డి చందు వాసు మల్లేశం యాదవ్ రెడ్డి పరశురాములు ఆసాని సత్య నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు