
ప్రవేట్ సెక్యూరిటీ గార్డ్స్ డిపార్ట్మెంట్లో ప్రైవేట్ వ్యక్తుల దౌర్జన్యాలు
వీరికి అండగా అధికారులు?
మాకే సెక్యూరిటీ గార్డ్ పోస్ట్‌లు ఇవ్వాలి…. లేనిపక్షంలో కాంట్రాక్టర్ ని బ్లాక్ లో పెట్టాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామపంచాయతీ నందు సింగరేణి సెక్యూరిటీ డిపార్ట్మెంట్ లో కుల సంఘాల పేరు చెప్పుకుంటూ కొందరు దళారి నాయకులు సెక్యూరిటీ గార్డ్ పోస్ట్ తమ వారికి మాత్రమే కేటాయించాలని లేనిపక్షంలో కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టాలని బెదిరిస్తున్నారు. సింగరేణి కి వీరికి ఎటువంటి సంబంధం లేని విషయాలలో. తలదూరుస్తూ. ఒక ప్రైవేట్ సెక్యూరిటీ సూపర్వైజర్ పై. నిందలు వేస్తూ ఆల్ కోల్ మెన్స్ గ్రూపులో వచ్చిన సమాచారాన్ని మాత్రమే ఫార్వర్డ్ చేశానని చెప్పిన సరే, ఆ సమాచారం వివిధ పత్రికలలో వచ్చిన సరే ,ఈ పోస్ట్ ని కుల సంఘాల పేరిట చిత్రీకరిస్తూ. కాంట్రాక్టర్ ని, సూపర్వైజర్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఈ సూపర్వైజర్ ఉంటే తమ ఆటలు సాగవని తమ వ్యక్తులని సెక్యూరిటీ గార్డ్ గా పెట్టుకోవడం కుదరదని తెలిసి, కులాల పేరుతో వర్కర్స్ నీ ఇబ్బంది పెడుతున్న విధంగా చిత్రీకరించి కాంట్రాక్ట్ బేస్ లో పనిచేసే సెక్యూరిటీ. సిబ్బందిని వారి ఆధీనంలో ఉంచుకొని. సింగరేణి. ప్రవేట్ సెక్యూరిటీ సూపర్వైజర్ ని తీసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారు అంత ఇబ్బంది పెడుతున్నా సరే వారి మీద చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనుక అడుగు వేయడం వెనుక ఉన్న మతలబు ఏమిటి? ఈ ముగ్గురికి అధికారుల అండ ఉన్నదా?
ఇప్పటికైనా అధికారులు ఇలాంటి వారి మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.