డాక్టర్ భాను ప్రసాద్
భద్రాచలం నేటి ధాత్రి
స్థానిక బిఆర్ అంబేద్కర్ హాస్పిటల్ నందు మహాజన మహిళా సమైక్య ఎంఎంఎస్ ఆధ్వర్యంలో సాంఘిక విప్లవ నేత పెరియార్ రామస్వామి 51 వ వర్ధంతి సందర్భంగా పెరియార్ చిత్రపటానికి నివాళి అర్పించటం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యమకారులు సామాజిక ఉద్యమకారులు ప్రముఖ హేతువాది డాక్టర్ భాను ప్రసాద్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ ప్రజలకు స్త్రీ లకు గౌరవం లేకుండా కులం, మతం పేరుతో ఏళ్ల నుంచి అసమానతలకు కారణమైన మనువాద వ్యవస్థపై ఆత్మగౌరవ పోరాటం చేసిన వ్యక్తి పెరియార్ రామస్వామి అన్నారు. సమాజాన్ని కులాల పేరుతో విడదీసి, ఆత్మగౌరవం లేకుండా అవమాన పరిచిన మనువాదుల గుండెల్లో తుపాకీ తూటగా మారిన గొప్ప సంఘసంస్కర్త పెరియార్ రామస్వామి అని కొనియాడారు. పేదలకు ఆత్మగౌరవం దక్కినప్పుడే సమాజంలో అసమానతలు తొలగి అందరికీ సమాన హక్కులు ఉంటాయని చెప్పిన పెరియార్ రామస్వామి నేటి సమాజానికి ఆదర్శం అన్నారు. ప్రతీ ఒక్కరు పెరియార్ మార్గంలో నడిచి ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహాజన మహిళా సమైక్య జిల్లా అధ్యక్షులు మేకల లత, ఉపాధ్యక్షురాలు కొచ్చర్ల కుమారి, కార్యదర్శి కొప్పుల నాగమణి,కోట ప్రశాంతి, రమణమ్మ, ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా సీనియర్ నాయకులు అలవాల రాజా పెరియార్, కొప్పుల తిరుపతి, భద్రాచలం పట్టణ ఎంఎస్పి ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కొమ్మగిరి వెంకటేశ్వర్లు,కొవ్వాల రవి, మేడ్చెర్ల లక్ష్మణ్, అంబోజి రత్నం, తదితరులు పాల్గొన్నారు