శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట ఎస్సైగా జక్కుల పరమేష్ ఇటీవల ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం మాజీ ఎంపీపీ బాసాని చంద్రప్రకాష్, మాజీ సర్పంచ్ కందగట్ల రవి మర్యా దపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందించి శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో పరకాల ఏఏంసి వైస్ చైర్మన్ మారపల్లి రవీందర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సాదు నాగరాజు, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు చింతల రవిపాల్ పాల్గొన్నారు. బిఆర్ఎస్ ఆధ్వర్యంలో శాయంపేట ఎస్సై జక్కుల పరమేష్ ను పరకాల ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ మారపల్లి నందం, బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గాజె రాజేందర్, సోషల్ మీడియా కన్వీనర్ ధైనంపల్లి సుమన్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ మత్స్యగిరి స్వామి ఆలయ కమిటీ చైర్మన్ సామల బిక్షపతి ఎస్సై ని కలిసి శాలువాతో సత్కరించారు.