
*నర్సంపేట,నేటిధాత్రి :
తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్య క్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామిని మంగళవారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు, ముందుగా ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆలయ అధికారులు అర్చకులు ఘన స్వాగతం పలికారు.ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే స్వామి వారికి కోడె కట్టి మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం ఆలయ పూజారులు ఎమ్మెల్యేతో సహా కుటుంబ సభ్యులకు వేద ఆశీర్వచనం చేసి లడ్డు ప్రసాదం అందజేశారు.