భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
మాలమహానాడు వ్యాయస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ పీవీ . రావు వర్ధంతి సందర్బంగా ది. 22.12.2024 సాయంత్రం కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ లోపీవీ రావు కి ఘనంగా నివాళులర్పించారు.మాలమహానాడు రాష్ట్ర సెక్రటరి జనరల్ ఎస్. మధుసూదన్ రావు (చిన్ని ), రాష్ట్ర సెక్రటరీ కూరపాటి రవీందర్ లు పి. వి.రావు చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఫటించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను పునికిపుచుకున్న పి. వి. రావు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో మాలమహానాడు ను బలోపేతం చేసి, మాలల ఐక్యతకు ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఈనాడు రాష్ట్రంలోని మాలమహానాడు నాయకులందరూ ఆయనను స్మరించుకొని, ఆయనమార్గంలో పయనించవలసిన అవసరం ఉందన్నారు. డా. బి.ఆర్. అంబేద్కర్, పి. వి. రావు ఆశయ సిద్ధికి మాలలందరు ముందుకు సాగి, మన జాతి అభ్యున్నతికి బాటలు వేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో వికలాంగుల రాష్ట్ర వ్యాయస్థాపక అధ్యక్షులు బీర రవీందర్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు సబ్బారాపు నాగేందర్ (బుస్సి ),మహిళా జిల్లా అధ్యకురాలు నక్కా సృజన, జిల్లా మహిళా అధ్యక్షురాలు మేరుగు అనసూర్య,జిల్లా నాయకులు వెలగపల్లి నాగయ్య, ఎస్. కృష్ణ తదితరులు పాల్గొన్నారు.