
కరీంనగర్, నేటిధాత్రి:
చింతకుంట గ్రామాన్ని కరీంనగర్ కార్పొరేషన్ లో విలీనాన్ని తక్షణమే నిలిపివేయాలని కోరుతూ చింతకుంట కెనాల్ వద్ద చింతకుంట గ్రామ ప్రజలు మరియు ఉపాధి హామీ కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున రాస్తారోకో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా భూక్యా తిరుపతి నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా గ్రామసభ నిర్వహించకుండా ఏకపక్షంగా దొడ్డుదారిలో కరీంనగర్ కార్పొరేషన్ లో విలీనం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కరీంనగర్ కార్పొరేషన్ లో విలీనం కావడం వల్ల ఉపాధి హామీ కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని దాదాపు వెయ్యి మంది కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడుతుందని అదేవిధంగా ఇంటి పన్ను, అభివృద్ధి విషయంలో కూడా పూర్తిగా వెనుకబడి అభివృద్ధి కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క రియల్ ఎస్టేట్ పెరిగి సామాన్యులు భూమి కొనలేని పరిస్థితి ఏర్పడుతుందని ఇది ముమ్మాటికీ చింతకుంట ప్రజలకు ఇబ్బంది తప్ప కరీంనగర్ మున్సిపల్ తో కలవడం వల్ల ప్రజలకు జరిగే లాభం ఏమీ లేదని గ్రామపంచాయతీ ఉండటం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు, గ్రామపంచాయతీ నిధులతో అభివృద్ధి చేయడానికి దోహదపడుతది తప్ప కార్పొరేషన్ విలీనం ద్వారా అది సాధ్యం కాదని ఇప్పటికే గతంలో విలీనమైన గ్రామాలను పట్టించుకోకుండా అక్కడున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురై అనేక సమస్యలతో సతమవుతావుతున్నారని వారికే సరైన నిధులు లేక ఇబ్బందులు పడతుంటే మాచింతకుంట గ్రామాన్ని కరీంనగర్లో కలపడం మూలంగా మరింత అభివృద్ధి కుంటుబడి మరి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైయ్యే అవకాశం ఉందని ఈసందర్భంగా తెలియజేస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈవిలీనియా పక్రియను ఆపివేయాలని తక్షణమే ముఖ్యమంత్రితో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విలీనియా పక్రియను తక్షణమే నిలుపుదల చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చింతకుంట గ్రామంలో వేలాదిమంది ప్రజలు జీవనోపాధి లేఖ ఉపాధి హామీ పథకమే జీవన ఆధారంగా తమ కుటుంబం పోషించడం కోసం మరి ఉపాధి హామీ కార్మికులుగా పనిచేసుకుంటూ జీవిస్తున్నటువంటి ప్రజల నోట్లో మట్టి కొట్టే విధంగా మరి నేడు తీసుకున్న ప్రభుత్వం ఈనిర్ణయం చాలా బాధాకరమైన నిర్ణయం. ఈనిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే నిలిపివేయడం కోసం ఉత్తర్వులు జారీ చేయాలని మరియు గ్రామ ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా గ్రామ సభ నిర్వహించకుండా ప్రజల సమస్యల్ని పట్టించుకోకుండా తీసుకున్నటువంటి నిర్ణయం. ఇది ప్రజా వ్యతిరేకమైనది ఇది ప్రభుత్వానికి మంచి పేరు ఉండదు ప్రజల పక్షాన ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి తప్ప ప్రజలకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాలకు వ్యతిరేకంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించవలసి వస్తుందని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తక్షణమే ఈనిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం తమ వైఖరి మార్చుకోకపోతే మరిన్ని ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి గ్రామపంచాయతీ కొనసాగించే విధంగా మాపోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఈరాస్తారోకో అనంతరం జిల్లా కలెక్టర్ కి ఉపాధి హామీ కార్మికులతో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనిపై కలెక్టర్ పమెలా సత్పతి స్పందిస్తూ మీయొక్క అభిప్రాయాన్ని ఏకీభవిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాను అని తెలియజేశారు. ఈకార్యక్రమంలో బిజెపి యువ మోర్చా అధ్యక్షులు రేణయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రేణిగుంట రాజు, రైతు సంఘం అధ్యక్షులు శంకరయ్య, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ సోమిరెడ్డి లచ్చిరెడ్డి, సోషల్ వర్కర్స్ కరుణాకర్, బీఆర్ఎస్ నాయకులు చెట్టుపల్లి నరేందర్, తిరుపతి గౌడ్, వాజిద్, రైస్, అంజయ్య, ఎల్లయ్య, మల్లయ్య, చింతకుంట గ్రామ ప్రజలు, ఉపాధి హామీ కార్మికులు దాదాపు మూడు వందల మంది పాల్గొన్నారు.