
ముస్లిం మైనారిటీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
హిందూ, ముస్లింల ఐక్యతనే భిన్నత్వంలో ఏకత్వమని రామకృష్ణాపూర్ పట్టణంలోని విజయ గణపతి ఆలయంలో అయ్యప్ప మాల ధరించిన భక్తులకు ముస్లిం మైనారిటీ ఆధ్వర్యంలో భిక్ష ఏర్పాటు చేసిన నేపథ్యంలో రామకృష్ణాపూర్ ముస్లిం మైనారిటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ…. అయ్యప్ప మాల ధరించిన అయ్యప్ప భక్తులకు ప్రతి సంవత్సరం ముస్లిం మైనారిటీ ఆధ్వర్యంలో బిక్ష ఏర్పాటు చేస్తామని తెలిపారు. మతాలు వేరైనా మనమంతా ఒక్కటేనని భిన్నత్వంలో ఏకత్వం గా ఉంటూ ముందుకు సాగాలని ఆ భగవంతున్ని వేడుకుంటున్నానని అన్నారు. హిందూ, ముస్లింలు సోదర భావంతో మెలగాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, పిసిసి కార్యదర్శి పిన్నింటి రఘునాథరెడ్డి, మండల బ్లాక్ కాంగ్రెస్ నాయకులు గోపతి రాజయ్య, ఎర్రబెల్లి రాజేష్, ముస్లిం మైనారిటీ నాయకులు ఎండి పాషా, అయ్యప్ప భక్తులు ముస్లిం మైనారిటీలు పాల్గొన్నారు.