
భద్రాచలం నేటి ధాత్రి
అభయాంజనేయ పార్క్ నందు అత్యధిక పోషక విలువలు కల్గిన పి కె ఏమ్ మునగ రకాలను ప్రముఖ పర్యావరణ ప్రేమికుడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గ్రహీత లయన్ డాక్టర్ గోళ్ల భూపతి రావు , విజిలెన్స్ కమిటీ మెంబర్ ఎల్ వెంకటేశ్వర్లు , గ్రీన్ భద్రాద్రి మాజీ అధ్యక్షుడు రామిసెట్టి కృష్ణార్జున రావు మరియు సంఘ సేవకుడు కడలి నాగరాజు లు నాటడం జరిగినది. ఈ సందర్భగా గోళ్ళ భూపతి రావు మాట్లాడుతూ మునగ ఆకులో ఎన్నో అనారోగ్యాలను నిరోధించ గల శక్తి ముఖ్య పోషకాలు పుష్కలంగా వున్నట్లు తెలియ చేసారు. అంతేకాకుండా విటమిన్ సి, కాల్సియం, ప్రోటీన్ ఐరన్ అమెనో ఆసిడ్స్ కూడా ఉన్నట్లు తెలియ చేశారు. ఈ సందర్భగా భద్రాద్రి వాసులు కు విజ్ఞప్తి ప్రతి ఇంటిలో ఒక మునగ మొక్కను పి కె ఏమ్ 1 రకంను నాటి నాణ్యమైన మునగ కాయలు మునగ ఆకులు ను రోజు వారి కూ రలలో వాడుకొన వలసినదిగా కోరడమైనది. అమెరికా కెనడా దేశాలలో కూడా మునగ ఆకును పొడిచేసి కారం కలిపి ఆహారంలో ఒక భాగంగా వాడు చున్నారు. లయన్ డాక్టరు గోళ్ళ భూపతి రావు,గ్రీన్ భద్రాద్రి. ఎల్ వెంకటేశ్వర్లు విజిలెన్స్ కమిటీ మెంబర్.