# ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.
# బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు.
నర్సంపేట,నేటిధాత్రి :
పదేళ్లు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే ప్రజలకు ఒరగబెట్టిందిదేమి లేదని,నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఎద్దేవా చేశారు.నర్సంపేట పట్టణానికి చెందిన 13 వ వార్డు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆ పార్టీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.రాష్ట్రంలో,నియోజకవర్గంలో
కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అని భావంతో టిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే దొంతి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ పదేళ్లు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇస్తే ప్రజలకు ఒరగబెట్టింది లేదని, రాష్ట్ర ప్రజలు, నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ఇచ్చిన ప్రతి హామీలను నియోజకవర్గ ప్రజలకు అందజేయడమే మా కాంగ్రెస్ ప్రజా పాలన లక్ష్యమని అన్నారు.
*కాంగ్రెస్ పార్టీలో చేరినవారులో..
బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారి వివరాలు..
బొమ్మరబోయిన ప్రేమ్ కృష్ణ,మాట్ల,సతీష్,బూసా రాజు,అనుముల అభినవ్,దేవరకొండ బిక్షపతి,అంకం లీల,ఉన్నంగి సౌమ్య,మార్త నీరజ,కవీత, విజయ,మట్లారి రజిత,ముదరుకొళ్ళ రజిత ఉన్నారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని రాజేందర్, నర్సంపేట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఓర్సు తిరుపతి, నర్సంపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు బానోతు లక్ష్మణ్ నాయక్, కౌన్సిలర్లు ఎలకంటి విజయ్ కుమార్, ములుకల వినోద-సాంబయ్య, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శులు బిట్ల మనోహర్, జన్ను మురళి, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి నాంపెల్లి వెంకటేశ్వర్లు గౌడ్, శ్రీరామోజు సౌందర్య, 13వ వార్డు అధ్యక్షులు కొల్లూరి రాజు, కోమండ్ల గణేష్, పైండ్ల పవన్, రాయపురం పెద్దరాజు, తదితరులు పాల్గొన్నారు.