చెరువులు చేరబట్టిన బిల్డర్లకు ఇక బాషింగాలే

`అక్రమ నిర్మాణాలపై సుప్రీం సీరియస్‌.

`అన్ని రాష్ట్రాలకు సుప్రీం ఆదేశాలు.

`పట్టణ ప్రణాళికల ఉల్లంఘన జరిగితే కఠిన చర్యలే!

`అధికారులపై కఠిన చర్యలే!

`బిల్డర్లకు ఇక చుక్కలే!

`నిబంధనలు దేశంలోని బిల్డర్లందరూ పాటించాలి.

`భూ బకాసురులకు భవిష్యత్తు బంధికానాలే!

`అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం మోపాల్సిందే!

`నిబంధనలకు విరుద్ధ నిర్మాణాలపై సుప్రీం కొరఢా.

`ప్రభుత్వ భూముల చెరబట్టిన వారికి చెరసాలే!

`దొంగ అనుమతులను సృష్టిస్తే బతుకు బస్టాండే!

`తప్పుడు నిర్మాణ దారుల తుప్పు వదలాల్సిందే!

`ఆక్రమణదారులకు వంతపాడితే అధికారులకు జైలే!

`వారికి సహకరిస్తే జీవితాంతం చిప్పకూడే!

`అధికారుల ఆస్థులు కూడా జప్తు చేయాల్సిందే.

`కట్టు దాటిన నిర్మాణాలు కూల్చుడే!

`పర్యావరణానికి హాని జరిగితే అందరూ బాధ్యులే!

`అక్రమ అనుమతులలో అందరూ దోషులే!

`బిల్డర్ల పని పట్టాల్సిందే..ముక్కు పిండి వసూలు చేయాల్సిందే!

`దొంగ బిల్డర్ల వెనుక వున్న నాయకుల రాజకీయాలు శంకరగిరి మాన్యాలే!

`పర్యావరణానికి హాని జరిగితే అందరికీ కటకటాలే!

`బ్యాంకులకు కూడా సుప్రీం చురకలు.

`కంప్లీషన్‌ సర్టిఫికేట్లు పూర్తి పరిశీలన తర్వాత మాత్రమే రుణాలివ్వాలి.

`క్రమ బద్దీకరణకు అధికారులు కుంటిసాకులు చెప్పొద్దు

`ప్రజలు పెట్టుబడి పెట్టారని సానుభూతి చూపొద్దు.

`ఆ సొమ్ము బిల్డర్ల నుంచి వసూలు చేసి పరిహారం చెల్లించాలి.

`భవిష్యత్తులో ప్రజలు నష్టపోకుండా అనుమతుల విషయంలో అలసత్వం వద్దు.

`ఎక్కడ పొరపాటు జరిగినా బాధ్యత మాదే అని బిల్డర్లు రాతపూర్వక హామీ ఇవ్వాల్సిందే.

`ఈ విషయంలో ఎలాంటి అతిక్రమణలు జరిగినా అధికారులు బాధ్యత వహించాల్సిందే!

`ఏ ఒక్క ఉల్లంఘన జరిగినా కోర్టు ధిక్కరణగా పరిగణనించాల్సి వస్తుంది.

`తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

   సొంత ఇల్లు ప్రతి వ్యక్తి కల. వారి వారి ఆస్ధిక స్దోమతను బట్టి ఇల్లు కొనుగోలు చేసుకుంటారు. అయితే ఇప్పుడున్న పరిస్ధితుల్లో నిర్మాణ రంగంలో వచ్చిన మార్పుల మూలంగా, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మూలంగా ఇల్లు కొనుగోలు ఖరీదైనప్పటికీ, కొంత సులభతరమైంది. నానాటికీ పెరుగుతున్న జనభా మూలంగా ప్రతి ఒక్కరూ లక్షలు పోసి భూమిని కొని ఇల్లు కొనుగోలు చేసుకోలేకపోతున్నారు. అదే సమయంలో సొంత ఇంటి కోసం అప్పార్టుమెంటు నిర్మాణాలవైపు చూస్తున్నారు. అదే సమయంలో రియల్‌ వ్యాపారులు ప్రజల అభిరుచుల మేరకు విల్లాలను కూడా నిర్మాణం చేస్తున్నారు. కాలనీలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే రియల్‌ వ్యాపారులు, బిల్డర్లు ప్రజలకు అందిస్తున్న భూములు సక్రమమైనవేనా? అవి ప్రభుత్వ భూములా? చెరువుల ఆక్రమణలా? అన్నది చెప్పకపోయేవారు. పైగా చెరువులను ఆక్రమించి, అధికారులకు పెద్దఎత్తున ముడుపులు చెల్లించి, అన్ని శాఖ అధికారులను ప్రసన్నం చేసుకొని, నాయకులు ఆశీస్సులతో లేక్‌ వ్యూల పేరుతో హైరేజ్‌ బిల్డింగులు నిర్మాణాలు చేపట్టారు. వాటిని కోట్ల రూపాయలకు అమ్ముకున్నారు. చేతులు దులుపుకున్నారు. ఈ తంతు కొన్ని దశాబ్ధాలుగా సాగుతోంది. ప్రజలు కూడా బిల్లర్లును గుడ్డిగా నమ్మారు. వారి చేతుల్లో లక్షలు పోసి మోసపోయామని ఇప్పుడు తెలుసుకుంటున్నారు. కాకపోతే ఒక స్ధలం కొనేప్పుడుగాని, ఇల్లు కొనుగోలు చేసేప్పుడు బిల్డర్లు చెప్పిన మాటలు మాత్రమే నమ్మి మోసం పోవడం ప్రజలకు అలవాటైపోయింది. తర్వాత లబోదిబో మనడం కామనైంది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతోంది. మొన్నటి వరకు అక్రమ నిర్మాణాల విషయంలో ఒకింత ఆలోచన చేసిన హైడ్రా కూడా ఇప్పుడు తాజాగా సుప్రింకోర్టు తీర్పుతో అక్రమార్కులనూ బుల్డోజర్లును ఎక్కుపెట్టే సమయం వచ్చేసింది. ప్రభుత్వ భూములు, చెరువులు ఆక్రమించి సాగించిన అక్రమ నిర్మాణాల విషయంలో శషబిషలు అవసరంలేదని, వాటిని కూల్చేయాల్సిందే అని సుప్రింకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ కూల్చి వేతల కారణంగా నష్టపోయే ప్రజలకు సంబంధిత బిల్డర్లు నుంచే పరిహారం వసూలు చేయాలని కూడా సుప్రింకోర్టు సప్పంగా చెప్పింది. దాంతో అక్రమ నిర్మాణదారులైన బిల్డర్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. 

                                                       చెరువులను చెరబట్టి, ప్రభుత్వ భూములు కబ్జా చేసి, అసైండ్‌ భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన బిల్డర్లను వదిలిపెట్టొద్దని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రింకోర్టు తీర్పు వెల్లడిరచింది. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి అక్రమ కట్టడాన్ని కూడా ఉపేక్షించొద్దుని సూచించింది. ఎట్టి పరిస్ధితులలోనూ అక్రమ కట్డడాలను ఉపేక్షించొద్దని రాష్ట్ర ప్రభుత్వాలకు దిశానిర్ధేశం చేసింది. గతంలో ఎప్పుడో ఉల్లంఘనలు జరిగాయనో, అప్పట్లో అన్ని అనుమతులు పొందారనో ఎవరి మీద సానుభూతి చూపించాల్సిన అవసరం లేదని కూడా సుప్రింకోర్టు తెలిపింది. రియల్‌ వ్యాపార సంస్ధలు వారు చేసే తప్పిదాలలో ప్రజలను కూడా బాధ్యులను చేస్తూ అక్రమ నిర్మాణాలు సాగిస్తుంటారు. ప్రభుత్వాలు ఏదైనా చర్యలు తీసుకునే సమయంలో ప్రజలను అడ్డుం పెట్టుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వారి ఆట కట్టించేందుకే సుప్రింకోర్డు ఈ విధమైన ఆదేశాలు జారీచేసినట్లు స్పష్టమౌతోంది. చేయాల్సిన తప్పులన్నీ బిల్డర్లు చేసి చేతులు దులుపుకోవడం అలవాటుగా మారింది. వారికి అధికారులు వంత పాడి, వారిని తప్పించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇక భవిష్యత్తులో తప్పులు చేసిన బిల్డర్లకు ఎవరు వంత పాడినా క్షమించే ప్రసక్తి లేదని సుప్రింకోర్డు స్పష్టం చేసింది. ఉత్తర ప్రదేశ్‌లోని ఓ కేసుకు సంబంధించి విచారణ జరిపిన జస్టిస్‌. జేబి. పార్ధీవాలా, జస్టిస్‌.ఆర్‌. మహదేవన్‌ల దర్మాసనం అక్రమ కట్టడాల నిరోధంపై 36 పేజీల తీర్పును వెలువరించింది. అందులో కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే జరిగిన అక్రమ నిర్మాణాలైనా, జరుగుతున్న వాటిలో అక్రమైనవి అని తేలినా వెంటనే కూల్చేయాలని ఆదేశించింది. అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రింకోర్టు తేల్చిచెప్పింది. ఇలాంటి విషయాలలో కోర్టులు కూడా ఎవరిపై సానుభూతి చూపించాల్సిన అవసరం లేదన్నది. వాళ్లు చేసేది అక్రమమని తెలిసే తప్పు చేసిన వారిని ఎట్టిపరిస్దితుల్లో ఉపేక్షించొద్దని సుప్రింకోర్టు చెప్పింది. అనుమతుల విషయంలో అధికారులు అత్యుత్సాహం చూపి, నిబంధనలు అతిక్రమిస్తే బిల్డర్లకే, అదికారులపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను ఆదేశించింది. తమ ఆదేశాలను ఎవరు పెడ చెవిన పెట్టినా, చట్టాలను ఉల్లంఘించినా, సుప్రింకోర్డు ఆదేశాలపై అసత్వం వహించినా కోర్టు దిక్కణగా పరిగణించాల్సి వస్తుందని ఘాటుగా హెచ్చరించింది. బిల్డర్లు చేసే నిర్మాణాల విషయంలో బ్యాంకులు కూడా గుడ్డిగా రుణాలు మంజూరు చేయొద్దని సూచించింది. అన్ని అనుమతులు వున్నట్లు రుజువులు, సాక్ష్యాలు చూపించినా, కాగితాలను పూర్తిగా పరిశీలించాలని సూచించింది. క్షేత్ర స్ధాయి పరిశీలన కూడా చేసి, ఎలాంటి పిర్యాధులు లేవని తేలిన తర్వాతే బ్యాంకులు రుణాలు ఇవ్వాలని సుప్రిం దర్మాసనం చెప్పింది. అన్ని రకాల కంపీషన్లు బ్యాంకులు పూర్తిగా పరిశీలన చేయాలని చెప్పింది. వాటి ఆధారంగానే ప్రభుత్వాలలోని వివిద విభాగాలు కూడా ఇతర సౌకర్యాల కల్పన చేయాలని చెప్పింది. నల్లా కనెక్షన్‌ కాని, కరంటు సరఫరా విషయంలో కూడా అన్ని అనుమతులను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించింది. ఇందులో కూడా ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా సంబంధిత అధికారులు కూడా బాధ్యత వహించాల్సి వస్తుందని సుప్రింకోర్టు తీర్పులో వెల్లడిరచింది. అంతే కాకుండా ప్రభుత్వ ప్రతి నిబంధనను పాటిస్తున్నామని ప్రతి బిల్లర్‌, కొనుగోలు దారులకు హమీ పత్రాలు ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి పర్యవససానాలకైనా తామే బాధ్యులని కూడా బిల్డర్లు చెప్పాల్సి వుంటుంది. అంతే కాకుండా ఎక్కడ ఏ నిర్మాణం జరిగినా వాటి నిర్మాణ దశలను కూడా అధికారులు ఎప్పటికప్పుడు రికార్డులు నమోదు చేయాలని కూడా అత్యున్నత దర్మాసనం సూచించింది. ఏ బిల్లర్‌ అయినా సరే పట్టన ప్రణాళికను తుచ తప్పకుండా పాటించాలి. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా మొదటికే మోసం వస్తుందని భయపడేలా అధికారుల పర్యవేక్షణ వుండాలి. పైగా ఇప్పటికే చెరువులను ఆక్రమించి, ప్రభుత్వ భూములను కబ్జా చేసి, అసైండ్‌ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. వాటిని వెంటనే గుర్తించి ఆక్రమణలు తొలగించాలన్నది. వాటిని కూల్చే విషయంలో ఎక్కడా రాజీ పడాల్సిన పనిలేదని సుప్రింకోర్టు చెప్పింది. ఎలాంటి నగరాలకైనా, పర్యావరణం ఎంతో ముఖ్యమని తేల్చిచెప్పింది. పర్యావరణానికి ఎలాంటి విఘాతం కల్గినా, ప్రభుత్వాలు ఉపేంక్షించకూడదని సూచించింది. చెరువులు రక్షణ, పునరుద్దరణ ప్రభుత్వాల బాద్యత అని చెప్పింది. గతంలో అనుమతులు ఇచ్చారని, దాంతో నిర్మాణాలు జరిగాయని కుంటి సాకులను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చెరువును కబ్జా చేసినప్పుడు తప్పు చేస్తున్నామని తెలిసినా, బిల్డర్లు కక్కుర్తి వ్యాపారం చేశారు. ప్రజలను మోసం చేశారు. లేక్‌ వ్యూల పేరుతో ప్రజలను బురిడీ కొట్టించారు. ఒక రకంగా ప్రజలకు అన్యాయం చేశారు. అన్ని రకాల అనుమతులున్నాయని అబద్దాలు ప్రచారం చేస్తే తప్ప ప్రజలు వాటిని కొనుగోలు చేయరు. ఇలాంటి అనుమతులు ఇచ్చిన అధికారులు కూడా అక్రమాలకు బాధ్యులే అని సుప్రింకోర్టు స్పష్టం చేసింది. అందువల్ల అధికారులు తప్పు చేసినట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను ఆదేశించింది. నిర్మాణాలలకు అనుమతులు మంజూరు చేసినప్పుడు అధికారుల్లో జవాబు దారి తనం వుండాలి. అధికారులు అనుమతులు ఇచ్చిన దానికి భిన్నంగా నిర్మాణాలు సాగితే కూడా అధికారులు సీరియస్‌గా తీసుకోవాలని సూచించింది. ప్రభుత్వ అనుమతుల కోసం చూపించిన ప్లాన్‌ ప్రకారం కాకుండా , ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా వెంటనే వాటిని కూల్చేయడానికి వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదని సూచించింది. నిబంధనలను అతిక్రమించి నిర్మాణాలు జరుగుతున్నాయని కోర్టుల దృష్టికి వస్తే నిర్మాణదారులపై ఎలాంటి సానుభూతి కోర్టులు చూపించొద్దని తెలిపింది. అక్రమ నిర్మాణాల క్రమ బద్దీకరణకు అసలే తావు లేదని సుప్రింకోర్టు తేల్చి చెప్పింది. క్రమ బద్దీకరణలో ఆలస్యం, పరిపాలనాపరమైన వైఫల్యాల కిందికే వస్తుంది. పెట్టుబడులు పెట్టారని సానుభూతిని కూడా బిల్డర్లపై చూపొద్దు. కాకపోతే క్రమబద్దీకరణ అన్నది అసాధారణ పరిస్దితుల్లోనే చేపట్టాలి. ప్రజలను , ప్రభుత్వాన్ని, పర్యావరణానికి నష్టం చేకూరుతుందని తెలిస్తే ఎట్టి పరిస్ధితుల్లో ఉపేక్షించొద్దని సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!