చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్(గర్ల్స్) లో కొత్త డైట్ మెనూ ను శనివారం రోజున ప్రారంభించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు. అంతకుముందుగా ఎమ్మెల్యే కు పరేడ్ చేస్తూ స్వాగతం పలికిన విద్యార్థినిలు, కాంగ్రెస్ నేతలు. అనంతరంజ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో భూపాలపల్లి నియోజకవర్గంలో అన్ని హాస్టళ్లలో కొత్త డైట్ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపినారు,ఇకనుండి రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్టళ్లో విద్యార్థులందరికీ ఒకే రకమైన ఆహార మెనూ అమలు చేయడం హర్షణీయమన్న ఎమ్మెల్యే, అలాగే విద్యార్థినిలు సమయం వృధా చేయకుండా సమయపాలన పాటించి బాగా చదువుకొని భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధించాలని అన్నారు, అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ గోల్కొండ బిక్షపతిని ఎమ్మెల్యే శాలువా కప్పి సన్మానించారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి, కార్యదర్శి గడ్డం కొమరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మధువంశీకృష్ణ, జిల్లా కాంగ్రెస్ నాయకులు చిలుకల రాయ కొమురు. జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య టౌన్ ప్రెసిడెంట్ బుర్ర లక్ష్మణ్ మండలనాయకులు గంగాధర్ రవి,క్యాతం మార్కండేయ, చిలుముల రాజమౌళి,తదితరులు పాల్గొన్నారు.