పరకాల నేటిధాత్రి
హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో బొడ్రాయి కాలనీలోని సత్యనారాయణ కిరాణంలో ప్రభుత్వ నిషేధిత అంబర్ గుట్కాలు అమ్ముతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు,టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీ చేయడం జరిగింది.అక్కడ దాదాపు 80160 రూపాయల విలువచేసే అంబరు గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.అనంతరం సత్యనారాయణ నుఅదుపులోకి తీసుకొని విచారించగా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని దురుద్దేశంతో ఈ చర్యకు పాల్పడినట్టు తెలిపారు.ఎస్ఐ శివకృష్ణ,టాస్క్ ఫోర్స్ అధికారులు,కానిస్టేబుల్ లు పాల్గొన్నారు.