# కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి.
# ఏఐఎఫ్టియు (న్యూ) రాష్ట్ర అధ్యక్షులు మోడెం మల్లేశం గౌడ్
నర్సంపేట,నేటిధాత్రి :
వరంగల్ జిల్లాలో గతంలో యజమానులతో చేసుకున్న హమాలి తదితర కార్మికుల కూలీరేట్లు,వేతనాల ఒప్పందం ఈ నెల 21 తో ముగుస్తున్న నేపథ్యంలో ఏఐఎఫ్టియు న్యూ అనుబంధ కార్మిక సంఘం మిల్ అండ్ హమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో డిమాండ్ నోటీసులు అందజేశారు.పెరిగిన నిత్యవసర సరుకుల ధరలకు అనుగుణంగా పాత రేట్లపైన 50 శాతం హమాలీ కార్మికుల కూలీ రేట్లు పెంచాలని ఏఐఎఫ్టియు (న్యూ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
మోడెం మల్లేశం గౌడ్ తెలిపారు.
రైస్ మిల్లులలో దిగుమతికి ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ సంచులను నిషేధించాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడులను రద్దు చేయాలని, 50 సంవత్సరాలు నిండిన హమాలీ కార్మికుడికి నెలకు రూ.5 వేల పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు. కార్మికులు పనిచేయుచున్న పరిశ్రమలలో త్రాగునీటి సౌకర్యం, విశ్రాంతికి షెడ్ల నిర్మాణం, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని, అసంఘటిత కార్మికులకు సమగ్రమైన చట్టం తెచ్చి, పని భద్రత కల్పించి, కనీస వేతనాలు అమలు చేయాలని పేర్కొన్నారు. కార్మికులకు ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించాలని తదితర వివిధ సమస్యలతో కూడిన డిమాండ్స్ తో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గంధం నరేందర్, ప్రధాన కార్యదర్శి సింగిరికొండ మాధవ శంకర్, ఫర్టిలైజర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ దోమకుంట్ల సురేష్,ఐరన్ షాప్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బూర అశోక్, నర్సంపేట మార్కెట్ కమిటీ సెక్రటరీ సూపర్వైజర్ లకు వివిధ సమస్యలతో కూడిన డిమాండ్స్ తో నోటీసులు అందజేసినట్లు మోడెం మల్లేశం గౌడ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఈర్ల పైడి, జిల్లా నాయకులు ఈరెల్లి రామచందర్, భూమా అశోక్, మిల్ అండ్ హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రుద్రారపు ఎల్లన్న, జిల్లా నాయకులు మెరుగు జనార్ధన్, మంద మల్లయ్య, ఇప్ప బాబు తదితరులు పాల్గొన్నారు.