కాంగ్రెస్ అభివృద్ధి
బీఆర్ఎస్ నాయకులకు పట్టడం లేదు కాంగ్రెస్ శ్రేణులు
నిజాంపేట: నేటి ధాత్రి
గత ప్రభుత్వ హయాంలో ఎంతోమంది నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇచ్చారో అనే అంశంపై చర్చకు మేము సిద్ధమని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో స్థానిక పెద్దమ్మ దేవాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మారుతి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు.. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఓరగబెట్టింది ఏమీ లేదన్నారు. 10 ఏళ్లలో చేయని అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ కాలంలో చేస్తే.. బిఆర్ఎస్ నాయకులకు పట్టడం లేదని వారు హెగ్డేవా చేశారు. ఇందిరమ్మ ఇండ్ల పథకములో నిరుపేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ పార్టీ ఆ పార్టీ అనే తారతమ్యం లేకుండా.. నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్ల పథకం అందేలా చూడాలని అధికారులకు ఆదేశించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నసిరుద్దీన్, లింగం గౌడ్, సత్యనారాయణ, కొమ్మాట బాబు, మసూద్, బూసి రెడ్డి, మ్యాదరి నర్సింలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు