జైపూర్,నేటి ధాత్రి:
శుక్రవారం రోజున జైపూర్ గ్రామ పంచాయతీ లో ఇందిరమ్మ ఇండ్లు సర్వే ను జైపూర్ ఎంపీడీవో జి.సత్యనారాయణ గౌడ్,ఎంపిఓ శ్రీపతి బాపూరావు,ఎండి.లయక్ అలీ ఎఈ హోసింగ్ డిపార్ట్మెంట్ సర్వే ను పరిశీలించడం జరిగింది.తదనంతరం జైపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణ లో నిర్మిస్తున్న రూఫ్ రైన్ వాటర్ హారవేస్టింగ్ స్ట్రక్చర్ ను పరిశీలించి తగు సూచనలు చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో పంచాయతీ కార్యదర్శి బి.ఉదయ్ కుమార్,జూనియర్ అసిస్టెంట్ టి.మల్లేష్,శృతి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.