మంచిర్యాల,నేటి ధాత్రి:
పోలీసులకు వజ్రాయుధం, వజ్రవాహనం
అల్లరి మూకలను చదరగొట్టడం లో వజ్రవాహనం పోలీసులకు వజ్రాయుధంగా పనిచేస్తుందని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు అన్నారు.పోలీస్ శాఖలోని ఏఆర్ విభాగం లో ఇటీవల ఎంపిక చేయబడిన నూతన కానిస్టేబుల్ లకు వజ్రవాహనం వినియోగంపై శుక్రవారం కమిషనరేట్ లో అవగాహన కల్పించారు.ఈ వాహనం ద్వారా ఒకేసారి ఏడు సెల్స్ ఉపయోగించి ఫైర్ చేసి అల్లరి మూకలను చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తీసుకురావచ్చన్నారు.