అనంతరం సర్టిఫికెట్ ల ప్రదానం
పరకాల నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సియం కప్ క్రీడలు ఈ నెల 9 వ తేదీన గ్రామ పంచాయతీ లలో క్రీడలు నిర్వహించి గెలుపొందిన వారికి మండల స్థాయిలో పోటీలు నిర్వహించి విజేతలను జిల్లా స్థాయికి పంపడం జరిగింది.అనంతరం గెలుపొందిన వారికి సర్టిఫికేట్ లు ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామీణ యువత ఎంతో మంది వివిధ క్రీడలలో నైపుణ్యం కలిగిన వారిని గుర్తించడానికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సియం కప్ క్రీడలు నిర్వహించడం జరుగుతుందని క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి యస్ రమాదేవి, నోడల్ అధికారి నామాని సాంబయ్య గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మధు, సురేందర్ యస్.జి.యఫ్ సెక్రటరీ సంధి కరిత వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు. పీఈటీలు విధ్యార్థులు యువకులు పాల్గొన్నారు.