గ్రామాల్లో పత్తి రైతులను మోసం చేస్తున్న దళారులను శిక్షించాలి.

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ డిమాండ్.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో గురువారం రోజున సిపిఐ ఎం.ఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ మాట్లాడుతూ
రైతుల పత్తి కొనుగోళ్లలో అవకతవకలను అరికట్టి దోపిడిని నివారించి వాస్తవ సాగుదారుల పత్తిని సిసిఐ బేశరతుగా కొనుగోలు చేయాలని పత్తి రైతులు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ప్రకృతి వైపరీత్యాలను దాటుకొని అరకొరగా పత్తిని పండిస్తే మద్దతు ధర కల్పించి ఆదుకోవాల్సిన సిసిఐ మార్కెటింగ్ అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరించడం సరైంది కాదని అన్నారు. పత్తి రైతుల పంటను కుంటి సాకులతో కొనుగోలు చేయకుండా నిరాకరిస్తూ మధ్య దళారులు గ్రామాల్లో రైతులకు మాయ మాటలు చెప్పి అతి తక్కువ ధరకు తీసుకువచ్చిన పత్తిని మాత్రం తప్పుడు పద్ధతులలో కొనుగోలు చేస్తున్నారని ఇదంతా దళారులు వ్యాపారులు సిసిఐ అధికారుల కుమ్మక్కై చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుందని ఆరోపించారు. పత్తి రైతును అష్టదిగ్బంధనం చేసి దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్లో బస్తాలలో తెచ్చిన పత్తిని అలాగే కుంటి సాకులతో సీసీఐ నిరాకరించే మండల కేంద్రంలోని మురుగన్ ఆంజనేయ పత్తి కొనుగోలు చేసే పత్తి మిల్లులలో పత్తి సెలక్షన్లో తూకంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని తక్షణమే అధికార యంత్రాంగం సిసిఐ కొనుగోలు కేంద్రాలపై పర్యవేక్షణ పెంచి రైతులకు జరుగుతున్న మోసాలను అరికట్టి దోపిడీకి పాల్పడుతున్న వ్యాపారులు మధ్య దళారులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని రైతులకు జరిగే నష్టాన్ని నివారించాలని కోరారు. అధికార యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోకపోతే రైతుల పక్షాన పత్తి కొనుగోలులో జరుగుతున్న దోపిడిని పట్టబయలు చేస్తామని హెచ్చరించారు. జిల్లా కమిటీ సభ్యుడు గంధం రాజ శంకర్.. సాద శ్రీనివాస్… జీడి రాజు.. వెంకటేష్ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!