భద్రాచలం నేటి దాత్రి
బహుజన కులాలు ఐక్యంకావాలి
రాజకీయ అధికారంలో ఎవరి వాటా వాళ్లు తీసుకోవాలి
బహుజన్ సమాజ్ పార్టీ (BSP) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జ్ తడికల శివకుమార్
దుమ్ముగూడెం మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం దుమ్ముగూడెం మండల బహుజన్ సమాజ్ పార్టీ మండల ఇన్చార్జి కొప్పుల నారాయణ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశ సందర్భంగా పార్టీ దుమ్ముగూడెం మండల అధ్యక్షులుగా పాయం ప్రసాద్ కి నియోజకవర్గ అధ్యక్షులు కొండా చరణ్ అధికారికంగా నియామక పత్రాన్ని అందజేసి మండల అధ్యక్షులుగా నియమించడం జరిగింది ఈ సమావేశానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంచార్జ్ తడికల శివకుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ బహుజన్ సమాజ్ పార్టీ మూల సిద్ధాంతమైన ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంత అనే దీన్ని ప్రాతిపదికగా చేసుకొని ఐదవ షెడ్యూల్ పరిధిలో ఉన్న భద్రాచలం నియోజకవర్గంలో అధిక జనాభా కలిగిన ఆదివాసులను రాజకీయాలలో జనాభాకు తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు బహుజన సమాజ్ పార్టీ కృషి చేస్తుంది దానిలో భాగంగానే బహుజన్ సమాజ్ పార్టీ దుమ్ముగూడెం మండల అధ్యక్షుడిగా దుమ్ముగూడెం మండలంలోని లచ్చిగూడెం గ్రామానికి చెందిన పాయం ప్రసాద్ ని నియమిస్తున్నామని అన్నారు పాయం ప్రసాద్ బహుజన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాడని బహుజన కులాలను ఐక్యం చేస్తాడని సమత సమాజ నిర్మాణం కై తోడ్పడుతాడని సామాజిక పరివర్తన ఉద్యమ రథాన్ని ముందుకు లాగుతాడని నమ్మకం ఉందని అన్నారు అంతేకాకుండా 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో భూములు ఘనులు నిధులు జనాభాకు తగినంతగా ఆదివాసులకు అందడం లేదని ఆ దిశగా ప్రభుత్వాలు ప్రయత్నించడం లేదని అందుకని బహుజన సమాజ్ పార్టీ రాజకీయ అధికారంలోకి వచ్చాక ఐదవ షెడ్యూల్లోని అంశాలన్నీ పూర్తిగా అమలుపరుస్తుందని అన్నారు
బహుజన్ సమాజ్ పార్టీ దుమ్ముగూడెం మండల కమిటీ
దుమ్ముగూడెం పార్టీ మండల ఇంచార్జ్ కొప్పుల నారాయణ