పంచాయతీ ఎన్నికలకు సిద్దమవుతన్న ప్రభుత్వం- పంచాయతీరాజ్ చట్టం రూపకల్పన

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సమగ్ర కుల గణాన కుటుంబ సర్వే నిర్వహించి కంప్యూటరీకరించిందినది. ఈ సర్వే ద్వారా వచ్చిన ఫలితాలతో వివిధ సామాజిక వర్గాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను వారి వారి జనాభా ప్రాతిపదికన కల్పించి ఎన్నికలకు జనవరి మాసంలో నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో ఇచ్చిన అంశాలను పరిగణనలోనికి తీసుకుని మహిళలకు ఆర్టిసిలో ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం, 200 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్తు అమలు చేయడం, 500 రూపాయాలకు ఉచిత గ్యాసు అందించడం, రైతులకు రుణమాఫీ, రైతుబంధు పథకాలను విజయవంతంగా అమలు చేయడంతో పాటు గత ఆరు మాసాలలో వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎన్నికైన అభ్యర్థుల వారికి నియమక పత్రాలన్నివ్వడంతో నూతనంగా ఎన్నికైన అభ్యర్థులను తమకు అనుకూలంగా ఓటు బ్యాంకు ఆశించడం స్థానిక ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని నమ్మకంతో కలదు. అలాగే నూతనంగా స్కీల్స్ యూనివర్సిటీ, వ్యాయామ విశ్వవిద్యాలయం ఏర్పాటుతో యువత నుండి అత్యధిక ఓటు బ్యాంకు కొరకే కాంగ్రెసు ప్రభుత్వం మున్సిపాలిటీలలో, గ్రామపంచాయతీలలో కూడా ఎక్కువ మెజార్టీ స్థానలను అధికార పార్టీ తన ఖాతాలో వేసుకోవలనే కాంగ్రెస్ ఆశభావంతో కలదు.

భారతదేశంలో పంచాయతీరాజ్ అనే మాట గ్రామీణ స్థానిక “స్వ ప్రభుత్వ” విధానము యొక్క ప్రాముఖ్యతను తెలుపుతుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు శాసనసభ చట్టాల ద్వారా గ్రామీణ స్థాయిలో ప్రజాస్వామాన్ని పటిష్టం చేయడానికి పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థకై 73వ రాజ్యాంగ సవరణ చట్టంతో 1992 సంవత్సరంలో రాజ్యాంగ హోదా లభించినది.

1957వ సంవత్సరంలో భారత ప్రభుత్వం సమాజాభివృద్ధి పథకాలు జాతీయ విస్తరణ కార్యక్రమాల అమలు విధానాన్ని అధ్యయనం, సూచనల కొరకై బల్వంతరాయ్ మెహతా అధ్యక్షతన కమిటీ నియమించారు అదే సంవత్సరంలో తన నివేదికను సమర్పించినది. ఇందులో ప్రజాస్వామ్య వికేంద్రీకరణ విధానాన్ని ఏర్పాటు చేయాలని సూచించినది. అందులో 1)మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామస్థాయిలో గ్రామ పంచాయితీ, బ్లాక్ స్థాయిలో పంచాయతీ సమితిలు మరియు జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్తులు ఎన్నిక పద్ధతిలో ఒకదానితో ఒకటి ముడిపడి ఉండాలని సూచించినది. 2) ప్రణాళిక మరియు అభివృద్ధి కార్యక్రమాలను ఒక వ్యవస్థకు అప్పగించాలి. 3) ఈ ప్రజాస్వామ్యిక సంస్థలకు న్యాయబద్ధంగా, వాస్తవంగా అధికారులను మరియు బాధ్యతలను బదిలీ చేయాలి. 4)అవసరమైన నిధులను మంజూరు చేయాలి, అలాగే ఇతర సిఫారసులను చేసినది. వీటిని ‘జాతీయ అభివృద్ధి మండలి’ జనవరి 1958 సంవత్సరంలో ఆమోదించినది.

భారత దేశంలో ప్రప్రథమంగా రాజస్థాన్ రాష్ట్రం పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసినది, 1959 అక్టోబర్ 2వ తేదీన ‘నాగౌర్’ జిల్లాలో నాటి ప్రధానమంత్రిచే ప్రారంభించినారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1959వ సంవత్సరంలో మూడు అంచెల వ్యవస్థను ఏర్పాటు చేసినది. అయితే తమిళనాడు రెండు అంచెల విధానం, పశ్చిమబెంగాల్ నాలుగు అంచెల విధానంతో స్థానిక పరిపాలన ఏర్పాటు చేసుకున్న రాష్ట్రాలు. న్యాయ పంచాయితీలను ఏర్పాటు చేసి వాటికి చిన్న చిన్న సివిల్, క్రిమినల్ వివాదాలను విచారించే బాధ్యతను అప్పగించడం జరిగినది. ఇప్పటివరకు పంచాయతీరాజ్ వ్యవస్థ పై నియమించబడిన అధ్యయన కమీషన్లు మరియు కమిటీలు ఈ విధంగా కలవు 1)1960 సంవత్సరంలో పంచాయితీ గణాంకాల హేతుబద్ధీకరణ కమిటీ అధ్యక్షులుగా వి.ఆర్. రావు 2)1961లో పంచాయితీలు మరియు సహకార సంఘాలు దీనికి ఎస్.డి మిశ్రా అధ్యక్షులుగా 3) 1961లో పంచాయతీ రాజ్ పై అధ్యయన బృందానికి వి.ఈశ్వరన్ 4) 1962 లో న్యాయ పంచాయతీల అధ్యయన బృందానికి జీ.ఆర్ రాజగోపాల్ కమిటీ 5) 1963 లో పంచాయతీరాజ్లో గ్రామసభ స్థానాల అధ్యయనానికై ఆర్.ఆర్ దివాకరన్ కమిటీ 6) 1963 లో పంచాయతీరాజ్ బడ్జెట్ మరియు అకౌంటింగ్ ప్రొసీజర్ కోరకై ఎం.రామకృష్ణ కమిటీని ఏర్పాటు చేశారు. 7)1963 లో పంచాయతీరాజ్ ఆర్థిక అంశాల అధ్యయనానికి కే.సంతానం కమిటీ 8) 1965 లో పంచాయతీరాజ్ ఎన్నికలపై కమిటీకి కే.సంతానం అధ్యక్షతన నియమించారు. 9)1965లో పంచాయతీరాజ్ వ్యవస్థల ఆడిటింగ్ మరియు అకౌంటింగ్ లపై నియమించారు. 10) 1966లో పంచాయతీరాజ్ శిక్షణ కేంద్రాలపై కమిటీకి జీ.రామచంద్రన్ అధ్యక్షులుగా 11) 1969 లో ప్రాథమిక భూసంస్కరణ చర్యల అమలులో సమాజాభివృద్ధి ఏజెన్సీ మరియు పంచాయతీరాజ్ వ్యవస్థలు కల్పించిన సహకారం పై అధ్యయనానికై కమిటీకి వి.రామనాథన్ ను నియమించింది, 12) 1972 సంవత్సరంలో సమాజాభివృద్ధి మరియు పంచాయితీరాజ్ లపై ఐదవ పంచవర్ష ప్రణాళిక రూపకల్పన కొరకై వర్కింగ్ గ్రూప్ అంశాలను అధ్యాయనానికి ఎన్.రామకృష్ణయ్యను నియమించింది. 13) 1976 వ సంవత్సరంలో సామాజాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ లపై అధ్యాయనం కమిటీకి శ్రీమతి దయాచూబేను నియమించారు.14) 1977 సంవత్సరంలో పంచాయతీరాజ్ వ్యవస్థల
బలోపేతానికి అశోక్ మెహతాచే కమిటీ నియమించినది. 15) 1985 వ సంవత్సరంలో ప్రణాళిక సంఘం గ్రామీణా అభివృద్ధి పేదరిక నిర్మూలన పథకాల ఏర్పాటుకై జీ.వి.కే రావు ఆద్వర్యంలో కమిటీ నియమకం 16)1986 సంవత్సరంలో ప్రజాస్వామ్యం మరియు అభివృద్ధి కొరకు పంచాయతీరాజ్ వ్యవస్థల పునఃర్ ఉత్తేజానికై ఎల్.యం సింఘ్వను నియమించినారు. 17) 1988 సంవత్సరంలో జిల్లా ప్రణాళికల నిమిత్తం జిల్లాలోని రాజకీయ పాలన నిర్మాణానికై తుంగన్ కమీటీ నియమకం 18) 1988వ సంవత్సరంలో పంచాయతీరాజ్ సంస్థల పనితీరును మరింత మెరుగుపరచడానికై గాడ్గిల్ కమిటీని నియమించారు.

రాజీవ్ గాంధీ ప్రభుత్వం పంచాయతీరాజ్ పటిష్టానికై 1989 జులైలో 64వ రాజ్యాంగ సవరణ బిల్లును లోకసభలో ప్రవేశపెట్టారు. 1989 ఆగస్టులో లోకసభ ఆమోదం పొందినది కాని రాజ్యసభలో ఈ బిల్లు వ్యతిరేకించబడినది. పాముల పర్తి నరసింహారావు ప్రభుత్వం పంచాయత్ రాజ్ సంస్థల రాజ్యాంగీకీకరణ కొరకై ప్రధానమంత్రి అధ్యక్షతన తిరిగి పరిశీలించిన వివాదాస్పద అంశాలను తొలగించి రాజ్యాంగ సవరణ బిల్లును 1991 సెప్టెంబర్ లోక్ సభలో ప్రవేశపెట్టింది చివరకు ఈ బిల్లు 73వ రాజ్యాంగ సవరణ చట్టం తో 1992 గా మారి 24 ఏప్రిల్ 1993 నుండి అమలులోనికి వచ్చింది. ఈ చట్టం ద్వారా రాజ్యాంగంలో నూతనంగా 9వ భాగాన్ని చేర్చడం ఈ భాగం “పంచాయత్స్” అనే పేరుతో రాజ్యాంగంలో ఆర్టికల్స్ 243 నుండి 243 ‘ఓ’లలో చేర్చబడింది. ఇందుకు అదునముగా ఈ చట్టం ద్వారా రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ కూడా చేర్చి 29 విధులను ప్రకరణ 243 ‘జీ’ లో పొందపరిచారు.

పంచాయతీల విస్తరణ చట్టం (1996 పెసా చట్టం): రాజ్యాంగంలోని తొమ్మిదవ భాగంలో పేర్కోనిన అంశాలు ఐదవ షెడ్యూల్లోని ప్రాంతాలకు వర్తించవు. కొన్ని సవరణలతో 73వ రాజ్యాంగ సవరణతో పార్లమెంటు “ప్రొవిజన్స్ ఆఫ్ ది పంచాయిత్స్” 1996 సంవత్సరంలో రూపొందించింది. దీన్నే ‘పెసా చట్టం’ అంటారు. ప్రస్తుతం పది రాష్ట్రాల్లో ఈ ఐదవ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉన్నాయి. అవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చత్తీస్ ఘఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా మరియు రాజస్థాన్ రాష్ట్రాలకి పెసా చట్టానికి అనుగుణంగా వాటి పంచాయతీరాజ్ చట్టాలను సవరించుకున్నాయి.

అసమర్ధ పని తీరుకు కారణాలు: 73వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ హోదాను, రక్షణను కల్పించినప్పటికీ పంచాయతీరాజ్ సంస్థల పనితీరు సంతృప్తికరంగా లేదు. పంచాయతీ వ్యవస్థల అసమర్ధత పనితీరుకు గల కారణాలు 1) పంపిణీ లోపం 2)అధికారుల అధిక నియంత్రణ 3)చాలీచాలని నిధుల కేటాయింపులు 4)ప్రభుత్వ నిధులపైనే ఆధారం 5)ఆర్థిక అధికారాల వినియోగానికి విముఖత 6)గ్రామసభ హోదా 7)సమాంతర సంఘాల ఏర్పాటు 8)మౌలిక నిర్మాణ లేమి.

రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్లో రాష్ట్ర జాబితాలో స్థానిక సంస్థ విషయం ప్రస్తావించబడింది. చట్టంలోని పదాలను ఇలా నిర్వహించినది పంచాయతీ అనగా గ్రామీణ ప్రాంతాల యొక్క ‘స్వప్రభుత్వ’ ఈ పేరుతోనైనా పిలవవచ్చును. గ్రామం అనగా గవర్నర్ ఆమోదం లో ప్రకటించబడిన ప్రదేశం మరియు ఇందులో ప్రత్యేకించబడిన కొన్ని గ్రామాల సముదాయం కూడా ఉండవచ్చు. ఇంటర్మీడియట్ అనగా గ్రామ మరియు జిల్లా స్థాయిల మధ్య గవర్నర్ చేత నోటిపై చేయబబడిన వ్యవస్థ. దేశంలోని అనేక గ్రామపంచాయతీలకు ఒక పూర్తిస్థాయి కార్యదర్షులు లేరు. పంచాయతీ సంస్థలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎక్కువమంది పెద్దగా చదువుకున్న వారు కాకపోవడం అందువల్ల తాము నిర్వహించాల్సిన పాత్ర మరియు బాధ్యతలు కార్యక్రమాలు విధానాలు పద్ధతుల గురించి పూర్తి అవగాహన ఉండడం లేదు. వారికి విధివిధానాలు బాధ్యతల పై ఎప్పటికప్పుడు అవసరమైన శిక్షణను అధికారులు అందించాలి. అప్పుడే వారు తమ విధులను సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఇంచుమించు అన్ని జిల్లా మరియు మండలాలు కంప్యూటర్ అనుసంధానత కలిగి ఉన్నాయి. గ్రామపంచాయతీలలో కేవలం 20% శాతం మాత్రమే కంప్యూటర్ సదుపాయం కలిగి ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు ఎన్నికవుతున్న వార్డులలో, సర్పంచ్ స్థానాలకు ఎన్నికైన వారిలో మహిళలు రిజర్వేషన్ స్థానంలో మాత్రం ఎన్నికవుతున్నారు కానీ జనరల్ స్థానలలో ఎన్ని కావడం లేదు మహిళలు ఎన్నికైన స్థానంలో అభ్యర్థి తాను కాకుండా వారి రక్తసంబంధీకులు లేదా పురుషులు, భర్తలు విధులు నిర్వహించడం వారే సభలకు హాజరవ్వడం వల్ల మహిళలలను అవమానపరచడమవుతుంది. అంటే పూర్తిస్థాయిలో పరిపాలన స్వేచ్ఛను కల్పించకపోవడం పురుషాధిక్యత కనపడుతుంది. అందుకే కింది స్థాయిలో ఇంకా రాజకీయ చైతన్యం రావలసిన అవసరం ఉంది.

వ్యాస రచయిత:
డా.తూము విజయ్ కుమార్, కాకతీయ విశ్వవిద్యాలయం చరవాణి-9492700653

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!