అన్న బాటలో తమ్ముడు..ఖమ్మంలో కాంగ్రెస్‌ను గెలిపించిన ధీరుడు !

`ఆనాడే ‘‘ఎమ్మెల్యే’’ సీటు ఇవ్వాల్సింది!

`తర్వాత ‘‘ఎంపి’’ సీటు దూరమైంది.

`ఇప్పుడైనా ‘‘ఎమ్మెల్సీ’’ సీటు ఇవ్వాల్సిందే!

`ఖమ్మం గుమ్మంలోకి కారు మళ్లీ రావొద్దంటే ‘‘ప్రసాద్‌ రెడ్డి ఎమ్మెల్సీ’’ కావలసిందే.

`ఖమ్మంలో కాషాయానికి చోటు దక్కొద్దంటే ‘‘ప్రసాద్‌ రెడ్డి’’కి ప్రాధాన్యత పెరగాల్సిందే!

`ఖమ్మంలో కాంగ్రెస్‌ అదే స్థాయిలో నిలబడాలంటే ‘‘ప్రసాద్‌ రెడ్డి’’ని ‘‘ఎమ్మెల్సీ’’ చేయాల్సిందే!

`‘‘ప్రసాద్‌ రెడ్డి’’ని ‘‘ఎమ్మెల్సీ’’ చేస్తే భవిష్యత్తులో ఖమ్మంలో ఇతరపార్టీలకు నిలువ నీడ లేకుండా చేస్తారు.

`ఖమ్మంలో ‘‘పొంగులేటి’’ కుటుంబానికి రాజకీయాలు ఎవరూ నేర్పలేదు.

`ప్రజాసేవకు ఎవరి తోడు వారికి అవసరం రాలేదు.

`’’పొంగులేటి’’ కుటుంబం అంటే ప్రజల జీవితం.

`ప్రజలే ‘‘పొంగులేటి’’ కుటుంబం.

`సార్వత్రిక ఎన్నికలలోనే ఎమ్మెల్యే కావాల్సిన అర్హతలన్నీ ‘‘ప్రసాద్‌ రెడ్డి’’కి వున్నాయి.

`సీట్ల సర్థుబాటులో ‘‘ప్రసాద్‌ రెడ్డి’’ త్యాగం చేశారు.

`అన్న కోసం కాంగ్రెస్‌ పార్టీని తిరుగులేని శక్తిగా నిలబెట్టారు.

`ఖమ్మం ‘‘ఎంపి’’ సీటు ఇచ్చినా అవలీలగా గెలిచేవారు.

`తనకు ఇవ్వకపోయినా ‘‘ఆన్న’’ ఆదేశం మేరకు పనిచేసి కాంగ్రెస్‌ ను గెలిపించారు.

`’’ఎమ్మెల్సీ’’ ఇస్తే ఇక ఖమ్మంలోనే కాదు, ఉమ్మడి వరంగల్‌ను కూడా కాంగ్రెస్‌ కు కంచుకోట చేస్తారు.

`వరంగల్‌ నుంచి కూడా కారును తరిమేస్తాడు.

`కాంగ్రెస్‌ కు ఎదులేకుండా కృషి చేస్తాడు.

`ఖమ్మంలోనే కాదు తెలంగాణలో అనేక జిల్లాలో కాంగ్రెస్‌ గెలుపుకు ‘‘పొంగులేటి సోదరులే’’ కారణం.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఖమ్మం గుమ్మంలోకి కారు రావాలంటే భయపడుతోంది. ఖమ్మంలో గులాబీ జెండా ఎరగాలంటే ఆలోచన చేస్తోంది. ఖమ్మంలో కారుకు మద్దతుగా నిలవాటంటే నాయకులు ఒకటికి పదిసార్లు ముందూ వెనక ఆలోచిస్తున్నారు. నీడ లేని చోట నిలబడాలని ఎవరూ అనుకోరు. కారుకే చోటు లేని చోట అందులో కూర్చోవాలని ఎవరూ అనుకోరు. ఖమ్మంలోకారు కే కాదు, కాషానికి స్ధానంలేదు. ఆ పార్టీకి క్యాడర్‌ కూడా లేదు. గులాబీ ఎప్పుడో వాడిపోయింది. చెట్టు ఖమ్మంలో ఎండిపోయింది. దానికి నీరు పోసే దిక్కులేదు. ఆ మళ్లను పట్టుకునేందుకు ఎవరూ ఇష్టపడడం లేదు. దానంతటికీ కారణం ఒక్కరే ఆ ఒక్కరూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. కాని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి రాజకీయం వెనక ఓ వ్యూహం వుంది. ఓ వ్యూహకర్త వున్నాడు. ఆ రెండూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోదరుడు ప్రసాద్‌ రెడ్డి. అన్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆలోచనలన్నీ అమలు చేసేది ప్రసాద్‌రెడ్డి. అన్న రాజకీయ జీవితానికి తోడుగా నిలిచింది ప్రసాద్‌ రెడ్డి. అన్న ఆశాలను తుచ తప్పకుండా పాటించడమే కాదు, అన్న కోసం తెలంగాణ ఎదరులేని శక్తిగా వున్న బిఆర్‌ఎస్‌ను కూడా మట్టి కరిపించింది ప్రసాద్‌ రెడ్డి. అన్న కోసం తమ్ముడి త్యాగం అంటే ఇదే. అన్న ప్రేమ కోసం తమ్ముడి జీవితం అంటే ఇదే. అంతలా అన్న కోసం, నమ్మిన సిద్దాంతాల కోసం పనిచేసే తమ్ముళ్లు చాలా తక్కువ. కాని అన్నే జీవితం. అన్నే సర్వస్వం. అన్నను ప్రజలకు ప్రాణం చేసిన తమ్ముడే ప్రసాద్‌రెడ్డి. అలాంటి నాయకుడు కూడా ప్రజల మనిషే. ప్రజా సేవలో ముందున్న నాయకుడే. ఖమ్మం జిల్లాలో పొంగులేటి కుటుంబం ఒక బ్రాండ్‌. వ్యాపారరంగంలో కింగ్‌. కాని ప్రజా సేవలో కూడా వాళ్లను మించిన వారులేరు. ప్రజలకు మేలు చేసిన వారిలో కూడా పొంగులేటికి మించిన వారు లేదు. అంతగా తమ ప్రాంత ప్రజలను గుండెల్లోపెట్టుకొని చూసుకున్న కుటుంబం పొంగులేటిది. అందుకే ఆ కుటుంబమంటేనే ఖమ్మం. ఖమ్మమంటేనే ఆ కుటుంబం. అంతలా ప్రజల జీవితాలతో మమేకమైన ఏకైక కుటుంబం పొంగులేటి. సహజంగా ఒక వ్యక్తి తన జీవితంలో ఎదగాలన్నా, జీవిత లక్ష్యం నెరవేరాలన్నా, జీవితంలో స్ధిరపడాలన్నా ఎంత కష్టపడాలో అందరికీ తెలుసు.

ఎన్నో ఒడిదొడుకులు, అడ్డంకులు, ఇబ్బందులు, సమస్యలు, సవాళ్లు ఇలా ఎదురైన ప్రతి అడ్డంకిని దాటుకుంటూ ముందుకు వెళ్లాలి. అలాంటిది రాజకీయాల్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించాలంటే ఎంత ధైర్యం కావాలి. ఎంత నిబ్బరం కావాలి. ఎంత గుండె ధైర్యం వుండాలి. అవన్నీ వున్న నాయకుడు పొంగుటేటి ప్రసాద్‌ రెడ్డి. అన్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎక్కడా ధైర్యం చెడకుండా, రాజకీయంగా కుంగిపోకుండా వుండేందుకు అన్నకు ఊత కర్రగా నిలిచిన నాయకుడు ప్రసాద్‌ రెడ్డి. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఎంతో సున్నిత మనస్కుడు. మృధుస్వభావి. అలాంటి నాయకుడు రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా,ఎదురులేని నేతగా ఎదగడంలో తమ్ముడు ప్రసాద్‌ రెడ్డి పాత్ర ఎంతో గొప్పది. అలాంటి ప్రసాద్‌ రెడ్డికి గత ఎన్నికల్లోనే ఎమ్మెల్యే సీటు కాంగ్రెస్‌ పార్టీ ఇస్తుందని అనుకున్నారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి రాజకీయాలు ఎవరూ పరిచయంచేసింది లేదు. రాజకీయంగా ఆయనకు దారి చూపిన వాళ్లు లేరు. రాజకీయంగా ఆయనను వెన్నుతట్టి నడిపిన వారు లేరు. శ్రీనివాస్‌రెడ్డి స్వయం ప్రకాశకుడు. స్వయం కృషితో ఎదిగిన నాయకుడు. ప్రజాసేవతో వెలుగులోకి వచ్చిన నాయకుడు. ప్రజలకు చేరువైన నాయకుడు. ప్రజల గుండెల్లో చోటు సంపాదించిన నాయకుడు. అలాంటి నాయకుడికి ఎవరూ ఓనమాలు నేర్పాల్సిన పనిలేదు. చేయిపట్టుకొని ముందుకు నడిపించాల్సిన అవసరం లేదు. అలాంటి నాయకుడు తెలంగాణలో ఒక్క పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మాత్రమే వున్నారంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడున్న పెద్ద పెద్ద నాయకులందరూ ఎక్కడో ఒక్కడ ఓ గొడుగు కింది ఎదిగిన వారే. కాని పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పార్టీలకు తన గొడుగు కింది చోటు కల్పించిన నాయకుడే. తనను నమ్మిన పార్టీలు ప్రాణం పెట్టిన నాయకుడే. అందరు నాయకులకు, శ్రీనివాస్‌రెడ్డికి వున్న తేడా ఇదే.

ఒకనాడు తెలంగాణలో చోటు లేని వైసిపికి కూడా ఊపిరిపోసి, పార్టీనికి విజయాలు అందించిన ఏకైక నాయకుడు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. తర్వాత బిఆర్‌ఎస్‌కు ఖమ్మంలో నారు పోసి పెంచిన నాయకుడు పొంగులేటి. కాని ఆయనను పక్కన పెట్టి తన ఉసురు తాను తీసుకున్న పార్టీ బిఆర్‌ఎస్‌. నారు పోసిన పొంగులేటిని పక్కన పెట్టి, పక్కనే మెలిచిన పిచ్చి మొక్కలకు నీరు పెట్టిన బిఆర్‌ఎస్‌ ఎండిపోయింది. నిజమైన పైరు పొంగులేటి అన్నది మర్చిపోయి పంట నాశనం చేసుకున్నది బిఆర్‌ఎస్‌. చేతులు కాలే దాకా మంట విలువ తెలియదన్నట్లు, పొంగులేటి దూరమయ్యేదాకా బిఆర్‌ఎస్‌కు ఆయన విలువ తెలియలేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే వచ్చే లాభమేమీ లేదు. కాని బిఆర్‌ఎస్‌ చేసిన పొరపాటుకు భవిష్యత్తు లేదు. తన ప్రాదాన్యత తగ్గించాలని చూసిన పొంగులేటి ప్రాభవమెంతో చూపడంలో పొంగులేటి ప్రసాద్‌ రెడ్డి పాత్ర సామాన్యమైంది కాదు. ఖమ్మం జిల్లాను కాంగ్రెస్‌ కు కంచుకోటను చేసిన శ్రీనివాస్‌రెడ్డి లక్ష్యసాధనంలో బాణం ప్రసాద్‌రెడ్డి. అందుకే కాంగ్రెస్‌కు అన్ని విజయాలు దక్కాయి. నిజానికి ప్రసాద్‌ రెడ్డికి ఎమ్మెల్యే సీటు ఇస్తారనుకున్నారు. ఖమ్మంలో పార్టీ గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న శ్రీనివాస్‌రెడ్డి తమ్ముడికి టికెట్‌ కోసం ఆలోచించలేదు. కాని పొర్లమెంటు ఎన్నికల్లో ప్రసాద్‌రెడ్డికి పార్టీ టికెట్‌ ఇస్తుందని అందరూ అనుకున్నారు. కాని కాంగ్రెస్‌లోని ఇతర నాయకులు కూడా పోటీ పడడంతో తప్పని పరిస్ధితుల్లో ప్రసాద్‌ రెడ్డి రెండోసారి కూడా త్యాగం చేశారు. ఇక ఇప్పుడు త్వరలో ఎమ్మెల్సీ పదవుల పంపకం జరిగే సమయం రానున్నది. ఈసారి ఎట్టిపరిస్ధితుల్లోనూ ప్రసాద్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. ఖమ్మం కాంగ్రెస్‌ శ్రేణులు కూడా కోరుతున్నాయి.

భవిష్యత్తులో కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడున్న పరిస్ధితిలో కొనసాగాలంటే, కారుకు స్ధానం దక్కకుండా వుండాలంటే ప్రసాద్‌రెడ్డి ప్రజా ప్రతినిధి అయితే ఖమ్మం కాంగ్రెస్‌ను మరింత కంచుకోటగా మార్చుతారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాష్ట్రాభివృద్ది కోసం పూర్తి స్ధాయి సమయం కేటాయించే అవకాశం వుంటుంది. ప్రసాద్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తే మంత్రిగా శ్రీనివాస్‌రెడ్డికి మరింత సమయం దొరికే అవకాశం ఏర్పడుతుంది. రాష్ట్రాభివృద్దిలో శ్రీనివాస్‌రెడ్డి కీలక భూమిక పోషించేందుకు మరింత సమయం దొరుకుతుంది. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో మరింత బలోపేతమయ్యేందుకు కృషి చేసేందుకు అవకాశం వుంటుంది. మంత్రి పొంగులేటి వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కూడా కారుకు స్ధానం లేకుండా చేయాలంటే అటు శ్రీనివాస్‌రెడ్డి, ఇటు ప్రసాద్‌ రెడ్డి ఇద్దరూ దృష్టిపెట్టేందుకు వీలౌతుంది. ఎందుకంటే శ్రీనివాస్‌ రెడ్డి అంటే ప్రజల నాయకుడు అనే పేరు పక్కనే ఖమ్మంలో బలంగా వుంది. ఆయన ప్రభావం ఖమ్మం మీద ఎంత వుందో గత ఎన్నికల్లో రుజువైంది. ఒకనాడు బిఆర్‌ఎస్‌ మీద పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సవాలు చేసిన నాడు, కొంత మందికి నమ్మకం కలగలేదు. కాని ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అంటేనే బిఆర్‌ఎస్‌ భయపడుతోంది. ఆ పార్టీకి వెన్నులో వణుకు వచ్చింది. అలాంటి నాయకుడు వరంగల్‌ మీద దృష్టిపెడితే వచ్చే ఎన్నికల నాటికి అక్కడ కూడా కారు ఖాళీ కావడం ఖాయంగా కనిపిస్తోంది. అన్నా దమ్ములు ఇద్దరూ దృష్టిసారిస్తే ఖమ్మంలాగానే, వరంగల్‌ కూడా పూర్తిగా కాంగ్రెస్‌ వశమౌతుంది. అందువల్ల ఎమ్మెల్సీల ఎంపికలో ఖచ్చితంగా ప్రసాద్‌రెడ్డిని పేరును పరిగణలోకి తీసుకుంటారని అనుకుంటున్నారు. ఎట్టిపరిస్ధితుల్లోనూ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సిందే అని ఆయన అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. అలాగే వరంగల్‌ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ నాయకులు కూడా ప్రసాద్‌రెడ్డికి పార్టీ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తే ఇక్కడ కూడా తిరుగులేని శక్తిగా మారేందుకు అవకాశాలు పుష్కలంగా వున్నాయంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!