తొర్రూరు (డివిజన్) నేటి ధాత్రి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా రవాణాలో ఉన్న బస్సుల సంఖ్యలు పెంచాలని డిమాండ్ తో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 11 ఛలో బస్సు భవన్ జయప్రదం చేయాలని ఆ పార్టీ మహబూబాబాద్ తొర్రూరు డివిజన్ కార్యదర్శి ముంజంపల్లి వీరన్న కోరారు. నేడు తొర్రూర్ లోని మాస్ లైన్ పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా వీరన్న మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రకరకాల పేరుతో 3000 బస్సుల తగ్గించారని అన్నారు. సహజంగానే పెరిగిన రద్దీ ఉన్న రూట్స్ లో ఉన్న బస్సులు సరిపోవటం లేదంటే వాటిలో కొన్నింటిని తగ్గించి పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు. అదనంగా యుద్ధ ప్రాతిపదికన నూతన బస్సులను ప్రవేశపెట్టి ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు చదువుల కోసం వస్తున్న విద్యార్థులకు, వివిధ పనుల కోసం వస్తున్న పేద సామాన్య మధ్యతరగతి ప్రజానీకానికి బస్సులు లేక అనేక అవస్థలు పడుతున్నారని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి మహిళల ఉచిత బస్సు ప్రయాణంలో ప్రయాణికుల కు ఎదురవుతున్న సమస్యలను తొలగించడానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. బస్సుల సంఖ్య పెంచాలని ఇప్పటికే రాష్ట్ర వ్యాపితంగా అనేక డిపోల ముందు ధర్నాలు నిర్వహించిన ప్రభుత్వం లో చలనం లేని కారణంగా డిసెంబర్ 11న బస్సు భవన్ మందు ధర్నా నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన తెలియజేశారు.ఇంకా ఈ సమావేశంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ తొర్రూర్ డివిజన్ నాయకులు బండపల్లి వెంకటేశ్వర్లు,ఊడుగుల రాములు సెగ్గం యాకయ్య,మండల నాయకులు బూర్గుల మోష బంగారు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు……