పెద్ద సంఖ్యలో హాజరైన బిఆర్ఎస్ శ్రేణులు
పరకాల నేటిధాత్రి
పరకాల నియోజకవర్గంలోని పరకాల పట్టణము భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి చిత్ర పటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.అనంతరం పరకాల మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం
దురదృష్టకరం రేవంత్ రెడ్డి ప్రభుత్వ దుశ్చర్యకు తెలంగాణ తల్లి కన్నీళ్ళు పెడుతుందని ఉద్యమ తల్లిని నేడు కాంగ్రెస్ తల్లిగా మార్చారని కోట్లాది మంది తెలంగాణ బిడ్డల్లో స్ఫూర్తి నింపింది తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు.ఈ కార్యక్రమం లో పరకాల,నడికూడ,మండలాల,పట్టణ సమన్వయ కమిటీ సభ్యులు,మాజీ ప్రజా ప్రతినిధులు,ప్రజా ప్రతినిధులు,అధ్యక్ష, కార్యదర్శిలు,యూత్ నాయకులు,వివిధ గ్రామాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.