డిఎంహెచ్వో ను మర్యాదపూర్వకంగా కలసిన గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్

హనుమకొండ జిల్లా, నేటిధాత్రి (మెడికల్):

తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా తరుపున ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ అన్నమనేని జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో ఇటీవల డిఎంహెచ్వో గా బాధ్యతలు స్వీకరించిన హనుమకొండ జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఏ అప్పయ్యని కలిసి అభినందనలు తెలియజేసి సత్కరించడం జరిగినది. ఈ సందర్భంగా శ్రీ జగన్మోహన్ రావు మాట్లాడుతూ ఆరోగ్య కార్యక్రమాల విజయవంతం చేయడంలో తమ సంఘం పూర్తి సహకారం అందిస్తుంది అని పేర్కొన్నారు. ఉద్యోగుల వారి కుటుంబ సభ్యుల కోసం హెల్త్ క్యాంపులు నిర్వహించడంలో తోడ్పాటును అందించాలని డి‌ఎం‌హెచ్‌ఓని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా గెజిటెడ్ ఆఫీసర్స్ జిల్లా అధ్యక్షులు శ్రీ మురళీధర్ రెడ్డి మరియు వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీ జి రామ్ రెడ్డి, హనుమకొండ జిల్లా కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ కుమార్, రాష్ర్ట కార్యదర్శి మరియు అడ్మినిస్ట్రేటివ్ అధికారి శ్రీ కోల రాజేష్ కుమార్ , సంఘం బాధ్యులు టి. మాధవరెడ్డి, సతీష్ రెడ్డి మరియు ప్రసన్న కుమార్, వి. అశోక్ రెడ్డి,సూపరింటెండెంట్ శ్రీ. వేణు గోపాల్, ఇ ,అనిల్ కుమార్, మధుసూదన్ రెడ్డి,అనిశెట్టి రమేశ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!