నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాలు మరియు పాఠశాలలలో
ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలో భాగంగా జిల్లా స్పెషల్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి సందర్శించారు.పట్టణంలోని రామాలయం ప్రాథమిక పాఠశాల అలాగే పాఠశాల ఆవరణలో గల అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేశారు. తనిఖీలో ఆహార పదార్థాల నిలువలు, స్టాక్ చేసుకునే పద్ధతి, వండిన ఆహార పదార్థాలను పరిశీలించారు. స్పెషల్ ఆఫీసర్ భాగ్యలక్ష్మితో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభ, ఉపాధ్యాయులు రవీందర్,వెంకటేశ్వర్లు, పద్మ, అంగన్వాడీ టీచర్లు నల్లా భారతి,బత్తిని శిరీష,ఎండీ గౌసియా, ఆయా సునీత ఉన్నారు.