ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

ప్రజా పాలన విజయోత్సవాల సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా పోలీసు కవాతు మైదానంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజల సహకారం మరియు విశ్వాసం ద్వారానే పోలీసు శాఖ సమర్థంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు పోలీస్ శాఖను దగ్గర చేయడం, వారి సమస్యలను నేరుగా వినడం, మరియు పోలీసుల కృషిని ప్రజలకు చూపించడమే మా ఉద్దేశ్యం అని ప్రజలను తెలుపుతూ శాంతి భద్రతలకు సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా పోలీసు శాఖలో వినియోగంలో ఉన్న ఆధునిక ఆయుధాలు, ఎక్స్‌ప్లోసివ్ డిటెక్టివ్ పరికరాలు, కమ్యూనికేషన్ డివైజ్‌లు, క్లూస్ టీం పరికరాలు, సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రదర్శన, పోలీసు శునక దళం (డాగ్ స్క్వాడ్) ప్రదర్శన, ట్రాఫిక్ నియంత్రణ పద్ధతులు, నేర అన్వేషణలో ఉపయోగించే ఆధునిక పరికరాలు వంటి అంశాలు కార్యక్రమంలో ప్రదర్శించబడ్డాయి.
విద్యార్థులు పోలీస్ శాఖకు సంబంధించిన వివరణలను ఆసక్తిగా చూసి, అనేక ప్రశ్నలు అడిగి సమాచారం పొందారు.
ఈ కార్యక్రమం లో అదనపు ఎస్పీ రాములు, ఏ ఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, డీఎస్ స్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్ బీ డీఎస్ స్పీ రమణా రెడ్డి, సైబర్ క్రైమ్ డీఎస్ స్పీ సుదర్శన్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శివ కుమార్, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గోపాల్, 1 టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య, 2 టౌన్ ఇన్స్పెక్టర్ ఇజాజ్ అహ్మద్, ఉమెన్ పీస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, ఆర్ ఐ లు కృష్ణయ్య, నగేష్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!