సోనియాగాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న 22వ డివిజన్ కార్పొరేటర్ బస్వారాజు కుమారస్వామి
వరంగల్ తూర్పు, నేటిధాత్రి
వరంగల్ తూర్పులోని పోచమ్మ మైదాన్ కూడలి వద్ద కొండా దంపతుల ఆదేశాల మేరకు, డిసెంబర్ 9వ తేదీ సోనియాగాంధీ పుట్టినరోజు సందర్బంగా గోపాల నవీన్ రాజ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న స్థానిక 22వ డివిజన్ కార్పొరేటర్ బస్వారాజు కుమారస్వామి. తెలంగాణ ప్రజల చిరకాల కోరికను నెరవేర్చిన కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ 79వ జన్మదిన వేడుకల సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల కోరిక ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినందుకు, తెలంగాణ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని తెలుపుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్పొరేటర్ వెంట స్థానిక నాయకులు దయాకర్, ప్రమోద్, వరంగల్ తూర్పు యూత్ కాంగ్రెస్ నాయకులు సిలివేరు రాజేష్, గుజ్జుల రాకేష్ రెడ్డి, గడ్డమీది వినయ్ కుమార్ తదితరులు ఉన్నారు.