రామకృష్ణాపూర్, నేటిధాత్రి
తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ అని రామకృష్ణాపూర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు అన్నారు. రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలను పార్టీ కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సోనియా గాంధీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రజారంజక పాలననే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలైన 6 గ్యారెంటీలను ప్రభుత్వం అమలుపరుస్తుందని వెల్లడించారు. ఇందిరమ్మ రాజ్య స్థాపనకు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.