ముఖ్యఅతిధిగా హాజరైన బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్
పరకాల నేటిధాత్రి
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా పరకాల పట్టణంలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి కన్వీనర్ పల్నాటి సతీష్,కో కన్వీనర్ పావుశెట్టి శేషు,దుర్గా వాహిని మహిళా ప్రముఖ్ సుమలత ల ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగే దాడులను వెంటనే ఆపాలని జై శ్రీరామ్ అంటూ భారీ నినాదలతో హిందూ మహిళలపై జరిగే ఆగాయిత్యాలను ఆపాలి అనే ప్ల కార్డులు పట్టుకొని దాదాపు 300 మందితో స్థానిక అంబేద్కర్ కూడలి నుండి బస్టాండ్ మీదుగా శక్తి స్థల వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బజరంగ్దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు మాట్లాడుతూ దేశంలోని హిందువులంతా మొద్దు నిద్ర వీడి ఐక్యం కావాల్సిన అవసరం ఉందని,హిందూజాతి సంఘటితంగా కాకపోతే బంగ్లాదేశ్ లో జరిగే దాని కంటే ఎక్కువ దుర్మార్గాలు చూడవలసి ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు ఆర్పి జయంతిలాల్,దేవునూరి మేఘనాథ్,డాక్టర్ నాగబండి విద్యాసాగర్,యర్రం రామన్న, పాలకుర్తి తిరుపతి,పరకాల మండలవిద్యార్థి,సంఘాలు వ్యాపార సంఘాలు,అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు.