రాజకీయంగా ఎదురుకోలేక హరీష్ రావు పై అక్రమ కేసులు

దాసరి రవి

పరకాల నేటిధాత్రి
ప్రజల కోసం ప్రతినిత్యం పరితపించే నాయ కుడు తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి హరీష్ రావుపై ప్రభుత్వం కక్ష పూరితంగా అక్రమ కేసులు బనాయించడం అన్యాయమని బి ఆర్ ఎస్ సోషల్ మీడియా చర్చ్ టి హెచ్ ఆర్ సేన దాసరి రవి అన్నారు. ఆయన మాట్లా డుతూ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని ప్రజల లో ఎత్తి చూపడమే హరీష్ రావు చేసిన తప్ప అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజలలో హరీష్ రావుకు పెరుగుతున్న ఇమేజ్ ని చూసి ఓర్వలేకనే, హరీష్ రావుకు భయపడే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులను పెట్టిస్తోందని ఆయన దుయ్యబట్టారు. సీఎం రేవంత్ రెడ్డి చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, ఆయన నియంత పాలనకు చమర గీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయనజోస్యం పలికారు. తెలంగాణ ఉద్యమంలో ఇలాంటి కేసులను హరీష్ రావు ఎన్నో ఎదుర్కొన్నారని, మచ్చలేని నాయకునికి ఇవి ఒక లెక్కన అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వ పేదలు స్పందించి మాజీ మంత్రి హరీష్ రావు పై పెట్టిన అక్రమ కేసులను భేషరతుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!