బీసీ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ భవనాలు వెంటనే పూర్తి చేయాలి.

ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి రాజు

భూపాలపల్లి నేటిధాత్రి

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ని బీసీ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ నిర్మాణం మధ్యలో ఆగినటువంటి బిల్డింగ్స్ ని పరిశీలించడం జరిగింది అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో బీసీ హాస్టల్స్ బాయ్స్ కావచ్చు గర్ల్స్ కావచ్చు ఈ విద్యార్థిని విద్యార్థులకు సంబంధించి హాస్టల్స్ కు సంబంధించి సొంత భవనాలు లేకపోవడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటున్నారు ఈ సమస్యలన్నీ కళ్ళ ఎదుట కనిపిస్తున్న పట్టించుకోని అధికారులు తక్షణమే హాస్టల్స్ నిర్మాణం వెంటనే పూర్తి చేసి చదువుకునే విద్యార్థులకు కనీసం మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి బీసీ బాయ్స్ కావచ్చు గర్ల్స్ కావచ్చు హాస్టల్స్ కు సంబంధించి రెంటు బిల్డింగ్ లో ఉంటున్నారు చాలీచాలని రూమ్స్ కనీసం వాష్రూమ్స్ కూడా విద్యార్థులకు అందుబాటులో ఉండడం లేదు ఉన్నటువంటి వాషింగ్స్ కూడా పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు బీసీ బాయ్స్ రెంటు ఉంటున్న హాస్టల్ కు సంబంధించి అందులో మొత్తం మంది 70 మంది ఉంటున్నారు రెగ్యులర్ గా 50 మంది పైన విద్యార్థులు ఉంటున్నారు వారికి సంబంధించి కనీస మౌలిక సదుపాయాలు సరైన సమయంలో అందుబాటులో ఉండకపోవడం వల్ల రెంట్ తీసుకున్న బిల్డింగులలో విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అదేవిధంగా గర్ల్స్ హాస్టల్ బీసీ కి సంబంధించి అందులో మొత్తం మంది విద్యార్థులు 95 మంది ఉన్నారు రెగ్యులర్గా 85 మంది విద్యార్థునిలు ఉంటున్నారు. వీరికి సంబంధించి వాటర్ సౌకర్యం గాని ఎలాంటి కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల విద్యార్థులు రోజువారిగా అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు తక్షణమే బీసీ హాస్టల్స్ భవనాలు పూర్తి చేయాలి. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు వంశీ రఘు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!