పంచ్ ఇచ్చిందంటే వేట మొదలెట్టినట్టే…!
ఓటమి తెలివని యాట చందనగా ముందుకు సాగాలి..!
జాతీయ స్థాయి పోటీలో జూలువిప్పి పోరాడాలి
జాతీయస్థాయి బాక్సింగ్ అండర్ 19 గేమ్స్ కి ఎంపికైన విద్యార్థి చందనను అభినందించిన ఖేలో ఇండియా బాక్సింగ్ కోచ్ ప్రభుదాస్
హనుమకొండ,నేటిధాత్రి:
హనుమకొండ ఇండోర్ స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ స్టేట్ ఆధ్వర్యంలో జరిగిన అండర్ 19 బాక్సింగ్ పోటీల్లో తనదైన శైలిని చాటి పిడిగుద్దులతో ఎదుటివారికి చెమటలు పుట్టించి పోటీలో గెలుపొందిన యాట చందన బాక్సింగ్ లో బహుశాలిగా అండర్ 19 బాక్సింగ్ పోటీలో గోల్డ్ మెడల్ సాధించింది. జాతీయస్థాయి బాక్సింగ్ అండర్ 19 గేమ్స్ కి ఎంపికైన విద్యార్థి చందనను అభినందించిన డివైస్ ఓ అశోక్ నాయక్ గుగులోత్ ఖేలో ఇండియా బాక్సింగ్ కోచ్ ప్రభుదాస్ దేవరకొండ చందన అభినందిస్తూ నేషనల్ స్థాయిలో కూడా చందన తనదైన శైలిని చాటి పోటీలో మెడల్ సాధించాలని కోరారు.