ఎన్నికైన విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రిన్సిపాల్ వీరలక్ష్మి
పరకాల నేటిధాత్రి
హనుమకొండలో జరిగిన కరాటే పోటీలలో పరకాల పట్టణంలోని ఆత్మకూర్ తెలంగాణ సాంఘిక సంక్షేమ కళాశాల,పాఠశాల విద్యార్థులు 22 మంది జాతీయస్థాయి సాధించడం జరిగింది. ఐదుగురు బంగారు పతకాలను,7విద్యార్థినులు వెండి పథకాలను,10 కాంస్య పథకాలను సాధించి అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించారు.పోటీలకు అర్హత సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ మరియు సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేయడం తెలిపారు.ఈ సందర్భంగా కళాశాలలో ప్రిన్సిపల్ వీరలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులను ఇంకెన్నో పోటీలకు తీసుకువెళ్లి విద్యార్థులను అనేక పథకాలు సాధించే విధంగా తీర్చిదిద్దుతామని అన్నారు. విద్యార్థినులను దృఢంగా తయారుచేసిన కరాటే మాస్టర్ కుమారస్వామికి కళాశాల పిఈటి వైష్ణవి,చైతన్యలను అభినందనలు తెలిపారు.