నేటిధాత్రి, వరంగల్ జిల్లా
వరంగల్ లక్మీపురంకు చెందిన కొరవి పరమేష్ వరంగల్ రూరల్ కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటీ చేశారు. హోరా హోరీ జరిగిన పోటీలో కొరవి పరమేష్ భారీ విజయం సాధించారు. వరంగల్ జిల్లా రూరల్ కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుడుగా పరమేశ్ భారీ విజయం సాధించడంతో జిల్లా వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు యూత్ కాంగ్రెస్ నాయకులు. కొరవి పరమేష్ మాట్లాడుతూ తనకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, వరంగల్ జిల్లా నాయకులకు, విజయం కోసం కష్టపడిన యూత్ విభాగం వారికి ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్న ప్రజాపాలనలో ఏడాది కాలంలో ప్రజలకు అద్భుతమైన పాలన అందించిన రేవంత్ రెడ్డి సారథ్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం కష్టపడి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.