జమ్మికుంటలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 99వ జయంతి స్థానిక సాయి మందిర్లో ఘనంగా

జన్మదిన వేడుకలు
జమ్మికుంట :నేటిధాత్రి జమ్మికుంట సత్యసాయి మందిర్ లో ఉదయం 5 గంటలకు ఓంకారము, సుప్రభాతము, నగర సంకీర్తన ఆ తదనంతరం పతాకావిష్కరణ చేయడం జరిగింది. స్థానిక బస్టాండ్ లో అందరికీ అల్పాహారం అందజేయడం జరిగింది. ఆ తదనంతరం 10:30 గంటలకు రుద్ర పారాయణము,అభిషేకము, భజన హారతి తర్వాత, స్వామివారి అమృత ఆహారం సుమారు 800 మందికి అందజేయడం జరిగింది.స్వామి వారి జన్మదిన వేడుకల సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ కార్మికులు 150 మందికి చెద్దర్లు, స్వామి వారి ప్రసాదం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని కార్మికుల సేవలను గుర్తించి వారికి చిరు కానుకలను సత్య సాయి సంస్థ అందజేయడం చాలా అభినందనీయం అని పొగడడం జరిగింది.సాయంత్రం కార్యక్రమాలలో భాగంగా సంగీత విభావరి, భజన, బాలవికాస్ పిల్లల చేత కూచిపూడి నృత్యాలు ఆ తర్వాత డోలారోహణము మరియు స్వామివారి సందేశము, హారతి తదనంతరం ప్రసాద వితరణతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి కన్వీనర్ శ్రీ గన్ను సతీష్ ,డాక్టర్ సత్యం సావిత్రి , చందా విశ్వనాథం పారిజాతం గారు మరియు గన్ను ఉపేందర్ శోభారాణి గారు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!