“నేటిధాత్రి” వేములవాడ టౌన్, అక్టోబర్ 23.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య మహా సభ జిల్లా అధ్యక్షులుగా ఎన్నిక కాబడిన బుస్స దశరథమ్ నూతన జిల్లా మీడియా కమిటి సభ్యుల ఎంపిక ఏర్పాటు చెయ్యడం జరిగింది. ప్రస్తుతం మీడియాలో వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేస్తున్న వేములవాడ పట్టణానికి చెందిన తాటిపళ్లి నరసింహస్వామిని జిల్లా కమిటీ విభాగంలో మీడియా కమిటీ కో చైర్మన్ గా నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా కమిటీ మెంబర్ లు, పట్టణ కమిటీ మెంబర్ లు అధ్యక్ష, ఉపాధ్యక్షులు పాల్గొనడం జరిగింది. జిల్లా మీడియా కమిటీ కు చైర్మన్ గా నియామక ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా అధ్యక్షులకు తాటిపల్లి నరసింహస్వామి ధన్యవాదాలు తెలుపుతూ తన ఎంపికకు సహకరించిన ప్రతి ఒక్క ఆర్య సోదర, సోదరీమణులకు పేరుపేరునా అభినందనలు తెలియజేస్తూ ఆర్యవైశ్య సంఘానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని సంఘ సభ్యులు కోరిన విధంగా సంఘాన్ని ఆదర్శవంతంగా తీర్చి దిద్దడానికి మీడియా పరంగా ఎలాంటి ఆపద వచ్చిన తన వంతు శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ మీడియా పరంగా సహాయం అందించడంతోపాటు తానున్నానని భరోసా కల్పించి ఆర్యవైశ్య సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని నింపుతానని ఎల్లవేళలా అండగా ఉంటానన్నారు. తన ఎంపిక చేసినందుకు ఆర్యవైశ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.