ఎస్ సి టీ పీసీస్ పాసింగ్ ఔట్ పరేడ్ కి ముఖ్య అతిథిగా కొత్తకోట శ్రీనివాస రెడ్డి, ఐపీఎస్

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం, జడ్చర్ల నందు 270 మంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కు చెందిన ఎస్ సి టీ పీసీస్ (స్టిపెండిరీ క్యాడట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్స్) (సివిల్ ) 9 నెలల ఇండక్షన్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తకోట శ్రీనివాస రెడ్డి, ఐపీఎస్, విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ మరియు ఎక్స్ అఫిషియో ప్రిన్సిపాల్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ పాల్గొన్నారు.


ఈసందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ఈ పాసింగ్ అవుట్ పరేడ్ శిక్షణ, క్రమ శిక్షణా ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది. ఈ 9 నెలల కఠోర శిక్షణతో మీరు మంచి ప్రదర్శనని ఇచ్చారు, ఇంత మంచి శిక్షణ అందించి మిమ్మల్ని పూర్తి స్థాయి పోలీసుగా రూపొందించిన ఈ డీటీసీ సిబ్బందికి నాయొక్క అభినందనలు, దేశ సేవ చేయడానికి ఇంత మంచి ఉత్తమ పౌరులను కన్న తల్లిదండ్రులు, మీరు వీరిని పోలీసు శాఖకు అప్పగించినందున మీకు నా అభినందనలు, ఒక చిన్న తప్పు చేసిన అది శాఖ మొత్తానికి ఆపాదించే ప్రమాదం ఉంతుంది, కాబట్టి ఒక రకంగా మన యొక్క విధులు బాధ్యతలు కత్తి మీద సామలాంటివన్నారు, ప్రజలలో ఈరోజుకు పోలీస్ శాఖ మీద ఉన్న గౌరవం, అభిమానం రాష్ట్రంలో గాని దేశంలో గాని ఏ శాఖకు లేదని అన్నారు. ఇది నా 30 సంవత్సరాల అనుభవంతో గర్వంగా చెబుతున్నాను ఎందుకంటే ప్రజలకు తెలుసు మనం త్యాగాలు చేస్తున్నామని అన్నారు. ప్రజలు ప్రశాంతంగా రాత్రిపూట నిద్రపోవాలంటే మనం మేల్కొని పనిచేస్తున్నామని, వారు ప్రశాంతంగా పండుగలు ఉత్సవాలు జరుపుకోవాలని మనం మన ఇండ్లలో పండగలు పబ్బాలను పక్కనపెట్టి వాళ్ల యొక్క ప్రశాంతత కోసం పనిచేస్తున్నాం అందుకనే పోలీసు శాఖకు అంతటి గౌరవం వుందన్నారు.
పోలీస్ ఉద్యోగం అనేది అన్ని ఉద్యోగాల లాగాకాకుండా కుటుంబ ధర్మం కన్నా వృత్తి ధర్మం నికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాల్సి వుంటుంది, ఎందుకంటే ప్రజలకు ప్రత్యక్షంగా సేవలు చేయాల్సి వుండాలి, ఇంకో విధంగా చెప్పాలంటే అనుక్షణం ప్రజలతో మమేకమై ప్రజల జీవితాల్లో భాగస్వాములై వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మనది అన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించిన డిటిసి వైస్ ప్రిన్సిపల్ నరసింహులు ని డీజీపీ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో జోన్ 7 జోగులాంబ, డి ఐ జి ఎల్ ఎస్ చౌహన్ ఐపీఎస్, జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి, వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్, ఐపీఎస్, డీటీసీ ప్రిన్సిపాల్ రాములు, ఏ ఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, డీటీసీ వైస్ ప్రిన్సిపల్ నర్సింలు, ఏ ఆర్ డీఏస్పీ శ్రీనివాస్, డీసీరబీ డీఏస్పీ రమణా రెడ్డి మరియు ఇతర పోలీసు ఉన్నత అధికారులు మరియు పి సి టీ పీసీస్ పోలీసు కుటుంబసభ్యులు పాల్గొంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!