యాదాద్రి భువనగిరి , నేటి ధాత్రి
చౌటుప్పల్ :చౌటుప్పల్ మున్సిపాలిటీ లక్కారం మత్స్యపారస్రామిక సహకార సంఘం భవనం వద్ద జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీ పాశం సంజయ్ బాబు ఆధ్వర్యంలో జెండా ఎగరవేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ సంజయ్ బాబు ముదిరాజ్ మాట్లాడుతూ వెనుకబడిన ముదిరాజ్ జాతిని ముందుకు నడిపించడం కోసం యువతరాన్ని అభ్యుదయ మార్గంలోనికి తీసుకురావడం కోసం నిరంతరం పాటుపడతానని మత్స్యకారుల అభివృద్ధి కోసం ఎల్లవేళలా తోడ్పాటు అందించి విద్యా ఉద్యోగం మరియు మనకు రావలసిన న్యాయపరమైన హక్కుల కోసం రాజ్యాధికార రిజర్వేషన్ల కోసం మరియు ముదిరాజులను బీసీ డీ గ్రూపు నుండి బిసి ఏ గ్రూపులోనికి మార్చుటకు నా వంతు కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు పాశం కృష్ణయ్య ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి పాశం రఘుపతి ముదిరాజ్ ,మాజీ కార్యదర్శి పాశం శ్రీనివాస్ ముదిరాజ్, డైరెక్టర్లు పాశం లింగస్వామి ముదిరాజ్, పాశం యుగంధర్ ముదిరాజ్, పాశం శ్రీను ముదిరాజ్ ,పాశం జంగయ్య ముదిరాజ్, పాశం రాజు ముదిరాజ్, సభ్యులు పాశం అంజయ్యముదిరాజ్, పాశం వెంకటేశంముదిరాజ్ ,జనమోని శ్రీను ముదిరాజ్ ,మన్యం శంకర్ ముదిరాజ్ ,పాశం రాజేష్ ముదిరాజ్, పాశం నరసింహ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.