
# ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్న 5 గ్యారెంటీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి
# లేనియెడల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు,ఆమరణ నిరాహారదీక్షలు చేపడతాం
# బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి
# ధర్మసమాజ్ పార్టీ ఆధ్వర్యంలో వీణవంక మండల తాసిల్దార్ కి వినతి పత్రం అందజేత
వీణవంక, (కరీంనగర్ జిల్లా):
నేటి ధాత్రి: తెలంగాణ రాష్ట్రంలో 90 శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం మండల తహశీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి మంది ప్రజలకు విద్యా వైద్యం ఉపాధి ఇల్లు భూమి ఈ ఐదు సమస్యలు ప్రధానంగా ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందు 5 ఐదు డిమాండ్లను ఉంచుతున్నట్లు తెలిపారు.
ప్రజలందరికీ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలి.
ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ప్రతి గ్రామంలో ఆధునిక ఆసుపత్రిని నిర్మించాలి.
ప్రజలందరికీ ఉపాధిని కల్పించాలి.
అర్హులైన వారందరికీ సాగునీటి సౌకర్యం ఉన్న ఎకరం భూమిని ఇవ్వాలి.
అర్హులైన వారందరికీ 200 వందల గజాలు నాలుగు గదులు ఇల్లు నిర్మించాలి.
ఐదు పథకాలకు మహాత్మ ఫూలే, అంబేడ్కర్, సాహు మహారాజ్, కాన్షీరామ్ మహనీయుల పేర్లు పెట్టి ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేసినప్పుడు మాత్రమే పేద ప్రజల జీవితాల్లో సామాజిక సాంస్కృతిక ఆర్థిక మార్పు ను తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ స్పందించని పక్షంలో జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వీణవంక మండల అధ్యక్షుడు సదానందం,రాకేష్,రవికిరణ్,అనిల్,వినయ్,తిలక్, లక్ష్మణ్,పృథ్విరాజ్,కిషోర్,రాజు, రమేష్,కుమార్,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.