జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా భీమరం మండలం కాజిపల్లి గ్రామంలో 71 వ అఖిలభారత సహకార వారోత్సవాలను మంగళవారం తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం రావడం జరిగింది.అలాగే జిల్లా సహకార అధికారి బి. సంజీవరెడ్డి,జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఈర్ల శంకర్, తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం గౌరవ అధ్యక్షులు సంధన వేణి మహేంద్ర నాథ్ యాదవ్,వన్ హాస్పటల్ ఎండి డాక్టర్ మర్రి మహేష్ రెడ్డి హాజరై ఏడు రంగుల జెండా ఎగరవేసి సహకార సంఘం గీతా ఆలాపన చేశారు.అనంతరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో దుప్పట్లు, చీరల,అవార్డ్స్ సర్టిఫికెట్లను సహకార సంఘాల బలోపేతం చేసిన సొసైటీ అధ్యక్షులకు అవార్డ్స్ ప్రశంస పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ రహదారులు బత్తుల శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర సలహాదారుడు బెర్రీ రామచందర్ యాదవ్,అక్కల మధుకర్ యాదవ్,భీమవరం మండలం నాయకులు కట్కూరి ప్రకాష్ రెడ్డి,మాజీ జెడ్పిటిసి భూక్యా తిరుమల, లక్ష్మణ్,పున్నం,సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.