భద్రాచలం నేటి దాత్రి
ఈ విషయం పై బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు గునూరి రమణ గారు మాట్లాడుతూ,
చర్ల మండలం సి.కత్తి గూడెం పంచాయతీలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఇసుక రాంపులపై తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. కత్తి గూడెం పంచాయితీ జిపి.పల్లిలో యం.పి.పి పాఠశాల విద్యార్థి తల్లిదండ్రులు పిల్లల ప్రాణాలకు భయపడి పాఠశాలకు పంపనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇసుక లారీలు వలన వచ్చే దుమ్ము, ధూళి పాఠశాల ఆవరణలో పిల్లల తిండి కి చాలా ఇబ్బందికరంగా మారింది.దాదాపు 1000 కి పైగా లారీలు కత్తి గూడెం ఇసుకరాంపులో ఉన్నాయి. ఇసుక లారీల వలన రోడ్లు మొత్తం గుంతలు గుంతలు పడి వేరే వాహనాలు తిరగనటువంటి పరిస్థితి. అధికారులు జేబులు నింపుకొని ఇసుకరాములకు పర్మిషన్లు ఇచ్చి ఇవాళ పటించుకొనటువంటి పరిస్థితి కనిపిస్తోంది.ఈ ఇసుక రాంపులో ఒక మంత్రి మరియు ఎంఎల్ఏ పాత్ర కీలకంగా ఉన్నది కావున మైనింగ్ అధికారులు కూడా చూసి చూడనట్టువంటి పరిస్థితి కనపడుతోంది. ఆ ఇద్దరు రాజకీయనాయకులు సొమ్ము కి ఆశపడి ప్రజల ప్రాణాలు కూడా లెక్కచెయ్యకుండా వారి జేబులు నింపుకుంటున్నారు. అలాగే గోదావరి చుట్టుపక్కల ఉన్న వందల ఎకరాల భూమికి అటుగా వెళ్తున్న రైతులు, కూలీలు,కూలీలను తరలిస్తున్న వాహనాలు,ప్రజలు భిక్కు భీక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది.కనుక ఈ విషయమై దృష్టి లో ఉంచుకొని ఉదయం ఆరు గంటలనుండి ఉదయం పదిన్నర వరకు అలాగే సాయంత్రం ఐదు గంటలకునుంచి ఏడు గంటలవరకు లారీలు ఆపగలరా అని రైతులు, కూలీలు, ప్రజలు వాపోతున్నారు.దీన్ని తక్షణమే టీఎండీసీ అధికారులు మరియు సంబంధిత అధికారులు తగిన చర్ల్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు గునూరి.రమణ