*పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ “వద్దిరాజు రవిచంద్ర”*
*”నేటిధాత్రి” న్యూఢిల్లీ*
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,కే.ఆర్.సురేష్ రెడ్డి,దీవకొండ దామోదర్ రావులు పలువురు బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల, ఎస్సీ, ఎస్టీ,మహిళా కమిషన్స్ కు లగచర్ల బాధితుల పక్షాన వినతిపత్రాలు సమర్పించారు.తెలంగాణలోనివికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్ల పరిసర గ్రామాలు, గిరిజన తండాలలో ఫార్మా కంపెనీల ఏర్పాటుకు రైతులకు ఏ మాత్రం ఇష్టం లేకున్నా కూడా ప్రభుత్వం బలవంతంగా భూములు స్వాధీనం చేసుకుంటున్నదని సోమవారం కమిషన్స్ కార్యాలయాలను సందర్శించి బాధితులతో కలిసి ఫిర్యాదు చేశారు.ఎంపీలు రవిచంద్ర, సురేష్ రెడ్డి, దామోదర్ రావు,మాజీ ఎంపీ మాలోతు కవిత, ఐపీఎస్ మాజీ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ తదితర ప్రముఖులు మానవ హక్కుల కమిషన్ ఛైర్ పర్సన్ విజయభారతి, ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కిషోర్ మక్వానా, ఎస్టీ కమిషన్ సభ్యులు నిరుపమ్ చక్మా, మహిళా కమిషన్ అధికారులను కలిసి బాధితుల కు అన్యాయం! జరుగకుండా,నష్టం వాటిల్లకుండా చూడాలని కోరారు.భూములు ఇవ్వడానికి తాము సిద్ధంగా లేకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఆయన సోదరులు పోలీసుల చేత భయపెట్టిస్తున్నారని,మగవాళ్లను అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేసి జైళ్లో పడేశారని, బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నామని గిరిజనులైన బాధిత మహిళా రైతులు ఆ యా జాతీయ కమిషన్స్ దృష్టికి తీసుకువచ్చారు.
బీఆర్ఎస్ ఎంపీలు రవిచంద్ర, సురేష్ రెడ్డి,దామోదర్ రావు, మాజీ ఎంపీ కవిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్,ఐపీఎస్ మాజీ అధికారి ప్రవీణ్ కుమార్ తదితర ప్రముఖుల ఆధ్వర్యాన వినతిపత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవా లక్ష్మీ,మాజీ ఎమ్మెల్యేలు రవీందర్ కుమార్, హరిప్రియ హరిసింగ్ నాయక్, పార్టీ ప్రముఖులు తుల ఉమ, రాంచందర్ నాయక్,రూప్ సింగ్ తదితరులు ఉన్నారు.