భద్రాచలం నేటి ధాత్రి
27న భద్రాద్రి పట్టణం గులాబీమయం అవ్వాలి
భద్రాద్రి లో బిఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తి
భద్రాచలం మండలం ముఖ్య కార్యకర్తల సమావేశంలో మానే రామకృష్ణ
భద్రాచలం16/11/2024.
భారత్ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ భద్రాచలం మండలం ముఖ్య కార్యకర్తల సమావేశం మండల పార్టీ కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది..
ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు మానే రామకృష్ణ పాల్గొని ప్రసంగించారు..
ఈనెల 27వ తేదీన జరిగే భద్రాచలం మండల జనరల్ బాడీ సమావేశం మోటార్ సైకిల్ ర్యాలీని జయప్రదం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు..
భద్రాచలం పట్టణం జనరల్ బాడీ సమావేశం సందర్భంగా గులాబీ మయం అవ్వాలని భద్రాద్రి పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ తిరుగులేని రాజకీయ శక్తి అని మరోసారి చూపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు..
రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు పక్క రాష్ట్రాల ప్రచారం చేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టారని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు అయ్యేంతవరకు బిఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుందని మానే రామకృష్ణ తెలిపారు
ఈ జనరల్ బాడీ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ .రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాజీ పార్లమెంట్ సభ్యులు మహబూబాద్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాలోత్ కవిత జిల్లా పార్టీ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ నియోజకవర్గ నాయకులు తాండ్ర వెంకటరమణ చర్ల దుమ్ముగూడెం మండల పార్టీ కన్వీనర్లు దొడ్డి తాతారావు కనితి రాముడు .తదితరులు పాల్గొనే ఈ జనరల్ బాడీ సమావేశంలో గులాబీ సైన్యం అంతా హాజరు కావాలని పిలుపునిచ్చారు
ఈ సమావేశంలో మండల పార్టీ కో కన్వీనర్ *రేపాక పూర్ణచంద్రరావు, మండల నాయకులు బత్తుల నరసింహులు, కోలరాజు ,అయినాల రామకృష్ణ, అంబటికర్ర
కృష్ణ, ఏడుకొండలు, బాడిస నాగరాజు ,కీసర యువరాజు, కాపుల సూరిబాబు, బద్ది బాబి ,ఆకోజు పృద్వి ,రాసాల శివ, డానియల్ ప్రదీప్, రవి వర్మ, ఇమంది నాగేశ్వరరావు, రాజుదేవర నాగరాజు ,మహిళా నాయకులు ప్రియాంక, గౌస్య, ఇమామ్ కాసిం, బాబు ,నాని, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు