శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రానికి చెందిన దైనంపెల్లి రవి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందా రు. ఈ క్రమంలో శనివారం కాంగ్రెస్ నేతలు మృతుని కుటుంబాన్నిపరామర్శించారు. అనంతరం పరకాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారపెల్లి రవీందర్ (బుజ్జన్న), కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బాసని మార్కండేయ మృతుని కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. ఈ పరామర్శ లో మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి, మాజీ జడ్పీటీసీ చల్లా చక్రపాణి, పరకాల మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా నాయకులు చిందం రవి, మారపెల్లి వరదరాజు,మాజీ సర్పంచులు దుబాసి క్రిష్ణ మూర్తి, అబ్బు ప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.