భద్రాచలం నేటి దాత్రి
BRS
దుమ్ముగూడెం మండల లోని లక్ష్మీనగరం గ్రామంలో ఉన్న ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు మరియు వార్డెన్లు మానసికంగా వేదించడంతో పాటు తన తల్లితండ్రులను పిలిపించి అక్రమ నిందలు వేసి అవమానించి ఇంటికి పంపడంతో ఆపాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న మట్ట.ధనలక్ష్మి అనే విద్యార్ధిని అవమానం భరించలేక ఇంట్లో ఉన్న పురుగుమందుసేవించి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుని ప్రాణాపాయ స్థితిలో ఉందని,గతంలో కూడా ఈ పాఠశాల నిర్వహణ లోపాలతో అనేకమంది విద్యార్ధిని,విద్యార్దులు అస్వస్థతకు గురయ్యారని,పైఅధికారుల పర్యవేక్షణ లోపంతో ఇప్పుడు విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడే పరిస్తితి వచ్చిందనీ, విద్యార్థిని ఆత్మహత్య కు కారకులైన ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు,మరియు వార్డెన్ లను తక్షణమే సస్పెండ్ చేసి తగు చర్యలు తీసుకోవాలని BRS పార్టీ మండల కన్వీనర్ కణితి.రాముడు,కో కన్వీనర్ Md. జానీ పాషా లు డిమాండ్ చేశారు.ఈ డిమాండ్ చేసిన వారిలో సీనియర్ నాయకులు కొత్తూరి.సీతారామారావు,మాజీ కార్యదర్శికణితి.లక్ష్మణ్,జిలకర.గంగరాజు,వాగే.కృష్ణ,కొమరం.చెంచయ్య,ధర్మరాజుపొడకలపల్లి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు