# అధ్యక్షుడుగా సైప సురేష్..
# కమిటీ ప్రకటన చేసిన చైర్మన్ మాధవ శంకర్.
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సేవ చారిటబుల్ ట్రస్ట్ నూతన
కార్యనిర్వహణ కమిటీ ఎన్నిక చేశారు.ట్రస్ట్ చైర్మన్ సింగిరికొండ మాధవ శంకర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.దేవాలయ అభివృద్ధి,కార్తీక పౌర్ణమి వేడుకలు, త్వరలో నిర్వహించబోయే మండల పూజల మహోత్సవాల పట్ల చర్చించారు.అనంతరం చైర్మన్ సింగిరికొండ మాధవ్ శంకర్ అధ్యక్షతన ట్రస్ట్ సభ్యుల సమక్షంలో నూతన కార్యనిర్వహణ ఎన్నిక నిర్వహించగా అధ్యక్షులుగా సైప సురేష్,ప్రధాన కార్యదర్శిగా చింతల కమలాకర్ రెడ్డి,కోశాధికారిగా దొడ్డ రవీందర్,ఉపాధ్యక్షులుగా ఇరుకు కోటేశ్వరరావు,పబ్బా రమేష్,ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా,శ్రీరాముల శంకరయ్య,చకిలం కృష్ణమూర్తి,తక్కలపల్లి యుగంధర్ రావు,బండారుపల్లి చెంచారావు,పాలకుర్తి శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీలుగా బొద్దుల దివాకర్,వజినపెళ్లి శ్రీనివాస్,సహాయ కోశాధికారి అనంతుల రామనారాయణ,ముఖ్య సలహాదారులుగా దేవునూరి అంజయ్య, మాదారపు చంద్రశేఖర్, వంగేటి గోవర్ధన్,శ్రీరామ్ ఈశ్వరయ్య,దోమకుంట్ల నందయ్య, దుబ్బా రమేష్,బాల్నే సర్వేశం,చింతల నిరంజన్,చిలువేరు వెంకటారాజం, మిడిదొడ్డి బాబురావు,భూపతి లక్ష్మీనారాయణలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ట్రస్ట్ చైర్మన్ సింగిరికొండ మాధవ శంకర్ ప్రకటించారు.