స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించిన భూపాలపల్లి డి.ఎస్.పి దంపతులు
జిల్లా ఎస్సీ డెవలప్మెంట్ అధికారి సునీత, శ్రీశైలం దంపతుల పూజలు
కార్తీక దీపాలు వెలిగించిన మహిళలు
స్వామివారికి నువ్వుల నూనెతో అలంకరణ
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో కాకతీయ కాలక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో కార్తీకమాస ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి వారికి ఘనంగా పూజలు నిర్వహించారు. ఉదయం గణపతి పూజతో అర్చకులు గంగాధర్ నాగరాజులు పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. కార్తీక సోమవారం సందర్భంగా భూపాలపల్లి డిఎస్పీ అవిరినేని సంపత్ రావు విజయ దంపతులు, జిల్లా ఎస్సీ డెవలప్మెంట్ అధికారి రాజబోయిన సునీత శ్రీశైలం దంపతులు స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి నందీశ్వరునికి పూజలు నిర్వహించారు. అదేవిధంగా మహిళలతో కలిసి దీప దానాలు చేశారు. కార్తీక మాసం రెండవ సోమవారం కావడంతో ఉదయం నుండే ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది
వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులతో ఆలయం రద్దీగా మారింది. క్యూలైన్ లో భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు జూలపల్లి నాగరాజు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో డి.ఎస్.పి సంపత్ రావు విజయ దంపతులను శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలను అందజేశారు.