రుణం తీర్చుకుంటాం

.పాలిటెక్నిక్ కళాశాల అభివృద్ధికి కృషిచేస్తాం

.70 ఏళ్ళ వేడుక సన్నాహక సమావేశంలో పూర్వ విద్యార్థుల ప్రకటన

కాశిబుగ్గ నేటిధాత్రి.

వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సంఘం ప్రచార కార్యదర్శి మేకల అక్షయ్ కుమార్ అధ్యక్షతన కళాశాల 70ఏళ్ళ వేడుక సన్నాహక సమావేశం ఆదివారం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి హాజరైన పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ తాము చదువుకున్న ఈ కళాశాల రుణం తీర్చుకుంటామని తెలిపారు. మౌళిక సదుపాయాలు మెరుగుపరచడానికి, కళాశాలలో చదివే పేద విద్యార్థులను అన్నిరంగాల్లో ప్రోత్సహించడానికి తమ వంతుగా కృషి చేస్తామని తెలిపారు.త్వరలోనే కళాశాల 70ఏళ్ళ వేడుక నిర్వహణకు అడ్ హక్ కమిటీ ఏర్పాటు చేసి, కార్యక్రమ విజయవంతానికి చేయవలసిన పనులు ప్రారంభిస్తామని తెలిపారు.ఈ సంధర్భంగా 1995-98బ్యాచ్ సివిల్ బ్రాంచ్ విద్యార్థుల తరుపున కళాశాల మహిళా వసతి గృహ ప్రాంగణంలో విద్యార్థినులకు యోగా మరియు వ్యాయామానికి గాను క్రీడా కోర్టులను ఏర్పాటు చేయిస్తామని తెలియజేశారు‌. కళాశాల నూతన భవన నిర్మాణానికి నిధులు కేటాయింపు ఉత్తర్వులు రావడానికి కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మరియు కళాశాల పూర్వ విద్యార్థి ఈవీ శ్రీనివాస రావు, కళాశాల ప్రిన్సిపాల్ డా. బైరి ప్రభాకర్ లకు సమావేశం ద్వారా పూర్వ విద్యార్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో కళాశాల పూర్వ విద్యార్థి మరియు కోస్గి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల‌ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, వరంగల్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ రామా ప్రసాద్, కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం కోశాధికారి నాగరాజరావు, ఏఈఈల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాస్, కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు దొడ్డిపల్లి కుమార్, పూర్ణ చందర్, పూదరి శ్రీకాంత్, వెంకన్న, ఆరిఫ్ ఖాన్, సామ్రాట్, శ్రీవిద్య తదితర పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!