పొంగులేటితో బిఆర్‌ఎస్‌కు ఫియర్‌ ఫీవర్‌!

 

`పొంగులేటిని ప్రశ్నించే అర్హత ఎవరికీ లేదు!

`బిఆర్‌ఎస్‌ కు అసలే లేదు!

`పొంగులేటిని నిలదీసే నైతికత బిఆర్‌ఎస్‌ ఇసుమంత కూడా లేదు.

`వైసిపి రాష్ట్ర అధ్యక్షుడుగా వున్న పొంగులేటిని రమ్మన్నారు.

`పొంగులేటి ఇంటి చుట్టూ వందల సార్లు తిరిగారు.

`బిఆర్‌ఎస్‌ లో చేర్చుకొని ప్రాధాన్యత తగ్గించాలని చూశారు.

`పొంగులేటిని రాజకీయంగా కనుమరుగు చేయాలనుకున్నారు.

`ఖమ్మంలో ఆధిపత్య రాజకీయాలకు ఆజ్యం పోశారు.

`పొంగులేటిని ఏకాకిని చేద్దామని కుట్రపన్నారు.

`పొంగులేటి ప్రజా బలం ముందు బిఆర్‌ఎస్‌ పప్పులుడకలేదు.

`పొంగులేటిని ఖమ్మంలో బలహీనం చేయడం వాళ్ల వల్ల కాలేదు.

`బిఆర్‌ఎస్‌ దుష్ట రాజకీయాలు చెల్లలేదు.

`పొంగులేటిని ప్రజలకు దూరం చేయలేకపోయారు.

`ఖమ్మం ప్రజల గుండెల్లో వున్న పొంగులేటిని కదుపలేకపోయారు.

`ఆ సంగతి తెలుసుకోక బిఆర్‌ఎస్‌ తన గోతి తానే తవ్వుకున్నది.

`బిఆర్‌ఎస్‌ పార్టీని ఖమ్మంలో నాశనం చేసుకున్నది.

`అయినా బిఆర్‌ఎస్‌ కు బుద్ధి రావడం లేదు.

`పొంగులేటి పై మాట్లాడే హక్కు బిఆర్‌ఎస్‌ కు లేనే లేదు.

`పొంగులేటి మీద విమర్శలకు తావు లేదు.

`శ్రీనివాస్‌ రెడ్డి ఆధిపత్యం చేసిందేమీ లేదు.

`ఎప్పుడైనా నమ్మిన పార్టీ కోసం పని చేశారు.

`నమ్మించి మోసం చేసిన బిఆర్‌ఎస్‌ కు చుక్కలు చూపించారు.

`శపథం చేసి బిఆర్‌ఎస్‌ ను అసెంబ్లీ గేటు తాకకుండా చేశారు.

` నాయకుడి రాజకీయ సత్తా అంటే పొంగులేటిది.

`పొంగులేటిని విమర్శిస్తే బిఆర్‌ఎస్‌ కు పుట్డగతులు కూడా వుండవు.

`నమ్మినందుకు నట్టెట ముంచాలనుకున్నారు.

`పొంగులేటి రిటన్‌ గిఫ్ట్‌ ఇస్తారని ఊహించలేదు.

`పొంగులేటి పవర్‌ను చూసి గిలగిల కొట్టుకుంటున్నారు.

`గాయి గాయి చేసి తిమ్మిని బమ్మిని చేయాలనుకుంటున్నారు.

`పశ్చాత్తాపపడి ప్రాయశ్చిత్తం చేసుకోలేక అవాకులు చెవాకులు పేలుతున్నారు.

`పొంగులేటి ప్రాభవం తగ్గించలేరు.

`మరింత పాతాళానికి వెళ్లేందుకే కారుకు దారులు వేసుకుంటున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

నవ్వే ముందు నలుగురు ఇబ్బంది పడొద్దు. మనం మాట్లాడితే నలుగురు తిట్టొద్దు. ఆ సంగతి తెలిసుకోకపోతే ఎప్పుడైనా ఇబ్బంది. నలుగురిలో వెకిలి నవ్వులు చిరాకు తెప్పిస్తాయి. సమయం, సందర్భంలేని మాటలు మాట్లాడితే తిట్లు పడతాయి. ఈ విషయాన్ని బిఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు ఇప్పటికైనా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారిక సమాచారం మేరకు, అవగాహన మేరకు మాట్లాడే మాటలను చులకన చేయడం బిఆర్‌ఎస్‌ నాయకులే ఇబ్బంది కరం. ఎందుకంటే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని విమర్శించే హక్కు ఏ ఒక్క బిఆర్‌ఎస్‌ నేతకు లేదు. ఆ నైతికత అసలే లేదు. పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి బిఆర్‌ఎస్‌లో రాజకీయ ఓనమాలు నేర్చుకున్న నాయకుడు కాదు. ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి అంతకన్నా కాదు. ఆయన బిఆర్‌ఎస్‌లో చేరకముందే ఖమ్మం పార్లమెంటు సభ్యుడు. తెలంగాణ వైసిపి రాష్ట్ర అధ్యక్షుడు. అది మర్చిపోయి బిఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడితే ఆకాశం మీద ఉమ్మేసినట్లే వుంటుంది. కడుపు చించుకంటే కాళ్ల మీద పడినట్లే వుంటుంది. పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తు కోసం బిఆర్‌ఎస్‌లో చేరలేదు. ఖమ్మం జిల్లాలో బిఆర్‌ఎస్‌ బలం కోసం పొంగులేటిని వాడుకున్నారు. ఆయన సేవలు వినియోగించున్నారు. ఆయన ఏనాడు బిఆర్‌ఎస్‌ మీద ఆధారపడలేదు. బిఆర్‌ఎస్‌ ఇచ్చిన పదువులు అనుభవించలేదు. బిఆర్‌ఎస్‌ ఆయన ఏనాడు లబ్ధిపొందిందిలేదు. బిఆర్‌ఎస్‌ పార్టీకి పొంగులేటి సర్వస్వం దార పోశాడు. తన విలువైన రాజకీయ జీవితాన్ని అంకితం చేశాడు. ఆఖరుకు పదవీ త్యాగం కూడా చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే బిఆర్‌ఎస్‌లో చేరకుంటే పొంగులేటి రాజకీయం మరో విధంగా వుండేది. ఆయన నాయకత్వం మరింత బలంగా వుండేది. రాష్ట్ర స్ధాయిలో ఎదరులేని నాయకత్వం పొంగులేటి సొంతమయ్యేది. ఇచ్చిన మాటకు కట్టుబడి వుండే నాయకుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. బిఆర్‌ఎస్‌లో చేరిన నాడే ఆయన పార్లమెంటు సభ్యుడు. దానికి తోడు ఆయన స్వయంగా గెలిపించుకున్న ఎమ్మెల్యేలను సైతం బిఆర్‌ఎస్‌లోకి తీసుకొచ్చారు. కొన్ని వేల మంది కార్యకర్తలను, వందలాది మంది అనుచరులను కారెక్కించారు. కాని ఆ కృతజ్ఞత బిఆర్‌ఎస్‌ చూపించలేదు. ఆయన సేవలను వాడుకున్నది. కూరలో కరివేపాకులాగా వాడుకొని వదిలేసింది. వైసిసి రాష్ట్ర అధ్యక్షుడిగా, పొర్లమెంటు సభ్యుడిగా వున్న పొంగులేటి ఇంటి చుట్టూ బిఆర్‌ఎస్‌ నేతలు ప్రక్షణాలు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే పొర్లుదండాలు పెట్టినంత పనిచేశారు. 2014 ఎన్నికల్లో కారుకు చోటు లేని సమయంలో పొంగులేటి అండ కోరుకున్నారు. తర్వాత కాంగ్రెస్‌ నుంచి చేరిన పువ్వాడ అజయ్‌ను అక్కున చేర్చుకున్నారు. పొంగులేటి రాజకీయానికి పక్కలో బల్లెం చేసి పెట్టారు. ఏమైంది? ప్రజలు బిఆర్‌ఎస్‌ను చీ అన్నారు. చీ కొట్టారు. గత ఎన్నికల్లో కారును చిత్తుచిత్తుగా ఓడిరచారు. కారును ఖమ్మం వీధుల్లో కనిపించకుండా చేశారు. అదీ పొంగులేటి పవర్‌. ఆ పవర్‌ను చూసైనా బిఆర్‌ఎస్‌కు బుద్ది వస్తుందనుకున్నారు. కాని బిఆర్‌ఎస్‌ అగ్రనేతల అహంకారం ఇంకా తగ్గలేదు. లోలోపల ఫియర్‌ ఫీవర్‌ వణికిస్తున్నా..పైకి డొల్ల ప్రకటనలు చేస్తున్నారు. ఇంకా ప్రజల ముందు బిఆర్‌ఎస్‌ పెద్దలు చులకనౌతున్నారు. పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదనకుంటారు. బిఆర్‌ఎస్‌లో వున్న పొంగులేటికి ఎంత పొగపెట్టినా బైటకు వెళ్లడని ఊహించారు. కాని పొంగులేటి ఆత్మగౌరవాన్ని అంచనా వేయలేదు. ఆయన బలాన్ని పదేళ్లలో తగ్గించామనుకున్నారు. కాని ఒక్కసారి పొంగులేటి కన్నెర్ర చేస్తే ఎలా వుంటుందో చూపించారు. బిఆర్‌ఎస్‌కు ఊపిరాడకుండా చేయడంలో దిక్కు తోచక విలవిలలాడుతున్నారు. నమ్మిన వారిని పక్కన పెట్టి,నమ్మక ద్రోహం చేసేవారిని అందలమెక్కించుకోవడం బిఆర్‌ఎస్‌కు అలవాటుగా మారింది. తాము చేసే రాజకీయానికి తిరుగులేదని అతి విశ్వాసానికి పోయింది. నిండా మునిగి ఖమ్మంలో కారు జాడ లేకుండాపోవడంతో విలవిలాడుతోంది. ఖమ్మంలో పొంగులేటిని పక్కన పెట్టుకున్నట్లే పెట్టుకొని వేధించాలని చూశారు. ఒక రకంగా చెప్పాలంటే అణిచివేయాలని చూశారు. కొని న్యూటన్‌ మూడో సూత్రం మర్చిపోయారు. పొంగులేటి కొట్టినా రాజకీయ దెబ్బ నుంచి కోలుకోలేకపోతున్నారు. కళ్లు బైర్లు కమ్మి మంత్రి పొంగులేటి మీద బిఆర్‌ఎస్‌ నేతలు కాకమ్మ కథలు చెప్పాలని చూస్తున్నారు. సొంత పార్టీలో వున్నప్పుడే పొంగులేటి రాజకీయాన్ని టచ్‌ చేయలేకపోయారు. ఇప్పుడు ఆయన మంత్రి. ఆయన రాజకీయాన్ని కదలించాంటే బిఆర్‌ఎస్‌ తాతలు దిగిరావాల్సిందే. అది కుదరని పని. పొంగులేటి రాజకీయాన్ని కనుమరుగు జరగనిపని. మంత్రి పొంగులేటి లాంటి నాయకులు కాంగ్రెస్‌కు ఎంత బలమయ్యారో..బిఆర్‌ఎస్‌ కూడా అంతే బలమయ్యారు. కాని ఆయన బలం బిఆర్‌ఎస్‌ అంచనావేసుకోలేకపోయింది. చతికిలపడిరది. ఇప్పుడు లబోదిబో మంటోంది. ఆ మంటలో ఏదేదో మాట్లాడుతోంది. ఎప్పుడైతే ఖమ్మం జిల్లాలో బిఆర్‌ఎస్‌ ఆధిపత్య రాజకీయాలకు ఆజ్యం పోసిందో అప్పుడే బిఆర్‌ఎస్‌ పతనం మొదలైంది. పొంగులేటికి బిఆర్‌ఎస్‌ చేసిన ద్రోహం శాపమైంది. బిఆర్‌ఎస్‌ మునిగిపోయింది. కారు కనుమరుగైంది. తిరుగులేని చోట, చీకటి కొని తెచ్చుకొని, ఇప్పుడు కళ్లల్లో నిప్పులు పోసుకుంటోంది. పొంగులేటిని ఏకాకిని చేయాలని ఎంతో ప్రయత్నం చేశారు. కాని కారుకే దిక్కులేకుండా చేసుకున్నారు. పొంగులేటి ప్రజా బలం ముందు కారు పప్పులు ఒక్క చోట కూడా ఉడకలేదు. ఖమ్మం గుమ్మందాటి కారు వెళ్లలేదు. ఖమ్మంలో పొంగులేటిని బలహీనపర్చాలని చూసిన బిఆర్‌ఎస్‌ అధినేత వల్లనే కాలేదు, ఇతర నేతల వల్ల అవుతుందా? తెలంగాణలో బిఆర్‌ఎస్‌ అడ్రస్తే గల్లంతై విలవిలలాడుతున్న తరుణంలో పొంగులేటిని ఇంకా విమర్శిస్తే ప్రజలు నమ్ముతారా? పిల్లి శాపాలకు ఉట్టి తెగిపడుందా? బిఆర్‌ఎస్‌ తప్పుడు మాటలను ప్రజలు నమ్ముతారా? అసలు బిఆర్‌ఎస్‌కు వత్తాసు పలికే నాయకుడు ఖమ్మంలో ఒక్కరు లేరు. అయినా బిఆర్‌ఎస్‌ అవాకులు చెవాకులు పేలితే ప్రజలు పట్టించుకుంటారా? పక్కనున్నప్పుడే పొంగులేటి రాజకీయం కనుమరుగు చేయాలని చూస్తేనే కుదలేదు. ఇప్పుడు ఆయనను కదపడం అన్నది కారు పెద్దల వల్ల అవుతుందా? అది సాధ్యమౌతుందా? లేనిపోని అబాండాలు వేస్తే జనం వింటారా? బిఆర్‌ఎస్‌ ఖమ్మం నాయకులే పొంగులేటి మీద నోరు మెడపడానికి ఇష్టపడరు. ఆ సంగతి తెలుసుకోలేక బిఆర్‌ఎస్‌ అగ్రనేతలు ఆగం మాటలు మాట్లాడితే అడ్రస్‌ లేకుండాపోయేది బిఆర్‌ఎస్‌ పార్టీయే. కారును అసెంబ్లీ గేటు తాకనివ్వని శఫథం చేసి మరీ కారును తక్కుతుక్కుగా ఓడిరచిన ఘనత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిది. ఇంకా బిఆర్‌ఎస్‌కు జ్ఞానోదయం కాకపోతే ఎవరూ ఏం చేయలేదు. ఇప్పటికే మునిగిపోయి వున్న కారును ఎవరూ బైటకు తీయలేదు. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడుతారన్న సామెతను నిజం చేసుకున్న పార్టీ బిఆర్‌ఎస్‌. గతంలో పొంగులేటి బిఆర్‌ఎస్‌లో వున్నా, ఆయన ప్రభుత్వంలో బాగస్వామ్యం కాలేదు. కనీసం పార్టీ పదవులను కూడా అనుభవించలేదు. ప్రభుత్వపరమైన ఎలాంటి పదవులు స్వీకరించలేదు. అందువల్ల బిఆర్‌ఎస్‌ నేతలకు పొంగులేటిపై విమర్శలు చేసేందుకు ఆస్కారమే లేదు. ఆయనపై ఎలాంటి నిందలేసినా చెల్లవు. నమ్మించి మోసం చేసినందుకు ఇప్పటికే బిఆర్‌ఎస్‌కు పట్టపగలే ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి చుక్కలుచూపించారు. ఇంకా శ్రీనివాస్‌ రెడ్డిని ఇలాగే విమర్శిస్తామని చూస్తే ఈ మాత్రం పుట్టగతులు కూడా బిఆర్‌ఎస్‌ వుండవు. కొంత కాలం పోతే కారు పార్టీలో ఖమ్మంలో ఒక్కరు కూడా వుండరు. కాకపోతే పొంగులేటి ఇంతటి రిటన్‌ గిఫ్ట్‌ ఇస్తారని బిఆర్‌ఎస్‌ కూడా ఊహించేలేదు. అందరినీ దెబ్బకొట్టినట్లే పొంగులేటిని కూడా దెబ్బతీద్దామనుకున్నారు. కుదరలేదు. పొంగులేటి వ్యూహం ముందు బిఆర్‌ఎస్‌ రాజకీయం పనికి రాలేదు. బిఆర్‌ఎస్‌ వేసిన మంత్రాలు, చేసిన మంత్రాగాలు ఫలించలేదు. పొంగులేటి విషయంలో చేసిన పొరపాటుకు బిఆర్‌ఎస్‌ పశ్చాత్తాపపడాలి. ప్రాయశ్చితం చేసుకునే మార్గం వెతుక్కొవాలి. పొంగులేటి మీద మాట్లాడేందుకు ముందూ వెనుక ఆలోచించుకొని మాట్లాడాలి. అంతే కాని పొంగులేటి మీద ఇంకా మాట్లాడితే కారు మరింత పాతాళానికి దారి వేసుకున్నట్లే..అంతే!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!